Na Ramudu Yadunnado Lyrics – Love Failure Song

0
Na Ramudu Yadunnado Lyrics
Pic Credit: 8Tv (YouTube)

Na Ramudu Yadunnado Song Lyrics penned by Parashuram_SP, music composed by Madeen SK, and sung by Hanumanth Yadav & Divya Malika.

Na Ramudu Yadunnado Song Credits

Song Love Failure Songs
Director Parashuram_SP
Producers Nischala & Swecha Pradhyuthi
Lyrics Parashuram SP
Singers Hanumanth Yadav, Divya Malika
Music Madeen SK
Artists Karthik Reddy, Vishwapriya Naidu
Song Lable

Na Ramudu Yadunnado Lyrics in English

Nuvvu Ittanga Vettukunna Pere
Maasi Pothaa Unnadhe
Ninnu Paanamga Soosukunna Vaade
Chachhipothaa Unnane
Taareraare Raare Raare Raare Raare Raare Ro
Taaraare Raare Raare Raare Raare Raare Ro

Aa Peddhamma Thalliki Maarichinaavu
Nannidisi Ellanani
Aa Eeshwaruni Meedha Ottesinaavu
Nannedipinchanani

Kanchamoola Buvva Gonthu Diguthaledhu
Kantipaina Gadiya Nidura Padataledhu
Inta Dhikkuleni Pakshinaipothino
Gurthukosthunte Paanaale Pothunnayo Oo

Naa Ramudu Yadunnado
Okkasaaranna Kanipinchado
Naa Devudu Ettunnado
Sinna Maatanna Inipinchado…

Aa Peddhamma Thalliki Maarichinaavu
Nannidisi Ellanani
Aa Eeshwaruni Meedha Ottesinaavu
Nannedipinchanani

Taareraare Raare Raare Raare Raare Raare Ro
Taaraare Raare Raare Raare Raare Raare Ro

Na Ramudu Yadunnado Lyrics in Telugu

నువ్వు ఇట్టంగ వెట్టుకున్న పేరే
మాసి పోతా ఉన్నదే
నిన్ను పాణంగ సూసుకున్న వాడే
చచ్చిపోతా ఉన్ననే
తారెరారే రారే రారే రారే రారే రో
తారారే రారే రారే రారే రారే రారే రో….

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినావు
నన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినావు
నన్నేడిపించనని
కంచమూల బువ్వ గొంతు దిగుతలేదు
కంటిపైన గడియ నిదుర పడతలేదు
ఇంట దిక్కు లేని పక్షినై పోతినో
గుర్తుకొస్తుంటే పాణాలే పోతున్నయో, ఓ

నా రాముడు యాడున్నడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు‌ ఎట్టున్నడో
సిన్న మాటన్న ఇనిపించడో…

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినావు
నన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినావు
నన్నేడిపించననీ

తారెరారే రారే రారే రారే రారే రో
తారారే రారే రారే రారే రారే రారే రో….

పంచభూతాల సాక్షిగా నువ్వు
పసుపుతాడు నా మెడలోన గట్టి
పంచప్రాణాలు నువ్వని జెప్పి
పట్టుకున్న సెయ్యి వదిలి వెళ్ళావు

నిను కంట జూడకుంటే
నాకు దిక్కు తోచకపోవయ్యో
నీతో మాటాడకుంటే
నాకు దుఃఖమొచ్చురోరయ్యో

ఎట్టుంటివో మావ ఎట్టుంటినో నేను
ఏ ఒక్కనాడైనా యాదికొస్తలేనా
నన్నిట్ట ఇడిసావో ఏ జాగనెలిసావో
ఇన్నొద్దులు మరిసి ఏ దిక్కునున్నావో ఓ

నీకు గోరుముద్దలు వెట్టినా
నా సేతులు సూసిపోయే
నిన్ను ఎత్తుకోని నడిసినా
నా పాదాలు తాకిపోయే

గుండెల్లో కొండంత బాధ దాసుకున్న
కళ్ళల్లో నీపైన ఆశ నింపుకున్న
కడదాక నీతోడు నేనుంటననుకున్నా

నా రాముడు యాడున్నడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు‌ ఎట్టున్నడో
సిన్న మాటన్న ఇనిపించడో…

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినావు
నన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినావు
నన్నేడిపించననీ

సిన్ననాటి నుండి కన్నతల్లి వోలె
కంటికి రెప్పలె సూసుకున్నవు
నా ఇంటి దీపము నువ్వని తలసి
బతుకుల్ల సీకట్లు నింపి పోయావు

నువ్వు కళ్ళల్లో మెరసుతుంటే
నాకు రంధి పట్టుకుందయ్యో
నువ్వు గుండెల్లో మెదలుతుంటే
నేను సచ్చిబతుకుతున్నయ్యో
ఏ కన్ను పడ్డాదో ఏ దిష్టి తగిలిందో
నిన్ను నన్ను ఇట్ట ఎడబాటు చేసిందో
నువ్వొచ్చేలోపే ప్రేమే నిను కోరి వస్తుందో
నా సివరి చూపులు నీకోసమున్నయో

నీ ప్రేమ నోసుకునే
నాకు భాగ్యము లేదేమొనే
నా రాత పాడుగాను
నాకు సావన్న వస్తలేదే
నెలలు నిండినా నిన్ను సూడకున్న
నెలపొడుపు జూసి నిన్ను తలుసుకున్న
సావైనా బతుకైనా నీతోనే అనుకున్నా

నా రాముడు యాడున్నడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు‌ ఎట్టున్నడో
సిన్న మాటన్న ఇనిపించడో…

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినావు
నన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినావు
నన్నేడిపించననీ…….

More Lyrics – Love Failure Songs

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.