Na Ramudu Yadunnado Part 2 Lyrics – నా రాముడు Song

Na Ramudu Yadunnado Part 2 Lyrics

Na Ramudu Yadunnado Part 2 Lyrics.

Na Ramudu Yadunnado Part 2 Song Credits

SongLove Failure Songs
DirectorParashuram SP
ProducerMallikarjun Reddy
LyricsParashuram SP
SingersHanumanth YadavDivya Malika
MusicMadeen SK
ArtistsKarthik Reddy, Vishwapriya Naidu
Song Lable

Nee Andala Ramudu Neekosamochindu
Okkasaari Choodave
Nee Gaaraala Ramudu Paanamodhuluthundu
Kadasaari Kanipinchave

Aa Peddhamma Thalliki Maarichinaane
Ninnidisi Ellanani
Aa Eeshwaruni Meedha Ottesinaane
Ninnedipinchanani

Maata Ichi Ninnu Mosaginchinaane
Ottuvesi Nenu Mantagalipinaane
Ontidhaanni Jesi illu Daatinaane
Gonthu Kosthunte Gunde Aagipothunnadhe

Na Ramudu Yadunnado Part 2 Lyrics in Telugu

నీ అందాల రాముడు నీకోసమొచ్చిండు
ఒక్కసారి చూడవే
నీ గారాల రాముడు పానమొదులుతుండు
కడసారి కనిపించవే

తారె రారే రారే రారే రారే రారే రో
తారారే రారే రారే రారే రారే రారే రో

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినానే
నిన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినానే
నిన్నేడిపించనని

మాట ఇచ్చి నిన్ను మోసగించినానే
ఒట్టువేసి నేను మంటగలిపినానే
ఒంటిదాన్ని జేసి ఇల్లు దాటినానే
గొంతు కోస్తుంటే గుండె ఆగి పోతున్నదే

నా సీతమ్మ యాడున్నదో
ఒక్కసారన్న కనిపించదో
నా బంగారమేడున్నదో
సిన్న మాటన్న ఇనిపించదో

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినానే
నిన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినానే
నిన్నేడిపించనని

బుడి బుడి అడుగులు వేసిననుండే
గావురంగ నిను చూసుకుంటినే
ముద్దు ముద్దు మాట లోపలికి రాసుందె
గుండెల్లో నిన్ను దాసుకుంటినే

నువ్వు రెండు జడలల్లుకుంటే
నిన్ను జూసి మురిసిపోదునే
నువ్వు లంగావోణేసుకుంటే
నే సుట్టే తిరుగుతుందునే

ఎట్టున్నవో నువ్వు ఏడున్నవో
నేడు తలుసుకుంటు నేను తల్లాడిల్లితున్న
నను వెతుకుతు నువ్వు
ఏ జాడ నడిచావో
ఎండమావోలే ఎదురొచ్చి పోయావే

సిలక గోరింకలోలే
కలిసుందామనుకుంటినే
రెక్కలు నరికేసిన పక్షులమైపోతిమే
కళ్ళల్లో నిప్పులు చల్లినట్టున్నాదే
గుండెల్లో గునపాలు గుచ్చినట్టున్నాదే
మెడ సుట్టు ఉరితాడు బిగిసినట్టున్నాదే

నా రాముడు యాడున్నడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు‌ ఎట్టున్నడో
సిన్న మాటన్న ఇనిపించడో…

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినావు
నన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినావు
నన్నేడిపించననీ

మనసువడ్డ నిన్ను మనువాడి నేను
మా ఇంటి రాణినే చేసుకుంటినే
నీ పెదవిపైన చిరునవ్వు ఎప్పుడు
చెదరకుండా నిన్ను చూసుకుంటినే

నువ్వు దిగులుగా కూసోనుంటే
నా గుండెలవిసిపోవునే
నువ్వు దుఃఖాలు పెట్టుకుంటే
నా ఊపిరాగి పోవునే

ఏ కన్ను పడ్డాదో ఏ దిష్టి తగిలిందో
నిన్ను నన్ను ఇట్ట ఎడబాటు చేసిందే
నువ్ పంచిన ప్రేమే నిను కోరి వస్తుందే
నా చివరి చూపులు నీకోసమేలేవే

నీకంట కన్నీరునే నే తుడువక పోతినే
ఆ అయోధ్య రామునోలె
నిన్ను కష్టాల్లో తోసేస్తినే
నిన్ను సూడకుండ క్షణము ఉండలేనే
నీతోనే నా బతుకు ముడివేసుకున్నానే
నువ్ లేని నా జన్మ చితిపైన శవమేనే

నా రాముడు యాడున్నడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు‌ ఎట్టున్నడో
సిన్న మాటన్న ఇనిపించడో…

ఆ పెద్దమ్మ తల్లికి మాటిచ్చినానే
నిన్నిడిసి ఎల్లనని
ఆ ఈశ్వరుని మీద ఒట్టేసినానే
నిన్నేడిపించనని

Love Failure Songs Lyrics