Home » Kuberaa » Naa Koduka Song Lyrics (కుబేర) – అమ్మ దీవెనిది ‘నా కొడుకా’

Naa Koduka Song Lyrics (కుబేర) – అమ్మ దీవెనిది ‘నా కొడుకా’

by Devender

Naa Koduka Song Lyrics ఈ మధ్య కాలంలో ఇలాంటి పాట రాలేదని చెప్పాలి. ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచే సాహిత్యం అందించిన నందకిషోర్ కు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అక్షరాలు కావు జీవిత సత్యాలు నిండి ఉన్నాయి ఈ పాటలో, ప్రతీ ఒక్కరు అమ్మను గుర్తు చేసుకునేలా ఉంది పాట. ముఖ్యంగా అమ్మలను కోల్పోయినవారు కళ్ళు చెమర్చక మానరు ఈ పాట వింటూ. అమ్మ పాట అంటేనే అదొక అనుభూతి, అందునా ఈ పాట ప్రత్యేకం, ప్రతి ఒక గుండెను చలింపచేసింది. బతుకు సారాన్ని కొడుకుకు ప్రకృతితో ముడివేసి సమాజం గురించి అమ్మ చెప్పిన విధానం అద్భుతం.

ఇంత గొప్ప పాటకు సాహిత్యాన్ని నంద కిషోర్ అందించగా, అంతే గొప్పగా సిందూరీ విశాల్ ఆలపించిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం స్వరకల్పన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో బిచ్చగాడిగా ధనుష్ నటించిన ఈ చిత్రం ‘కుబేర’. ఈ పాట లిరిక్స్ మీకోసం…..

Naa Koduka Song Credits

MovieKuberaa Telugu (20 June 2025)
DirectorSekhar Kammula
ProducersSuniel Narang, Puskur Ram Mohan Rao
SingerSinduri Vishal
MusicDevi Sri Prasad
LyricsNanda Kishore
Star CastNagarjuna Akkineni, Dhanush, Rashmika Mandanna
Music LabelAditya Music

Naa Koduka Song Lyrics in Telugu and English

Pacchaa Pacchaani Chelallo
Pooseti Puvvula Taavullo
Navvulu Eruthu Nadicheddaamu
Chethulu Pattuko Naa Kodukaa

Kadupuna Ninnu Daachukuni
Needalle Ninnantukuni
Kalise Untaa Eppatikee
Kalise Untaa Eppatikee
Nee Chethini Vadhalanu… Naa Kodukaa

Padhilamgaa Nuvu Nadavaale
Padhi Kaalaalu Nuvu Bathakaale
Chandamamaku Chebuthunnaa
Ninu Challaga Choosthadhi Naa Kodukaa

Aakalitho Nuvvu Pasthunte
Nee Dokkalu Endipoyeraa
Chettu Chettuki Chebuthunnaa
Nee Kadupu Nimpamani Naa Kodukaa

Niddura Leka Nuvvunte
Nee Kannulu Erraga Maareraa
Neeli Mabbutho Chebuthunnaa
Nee Jola Paadamani Naa Kodukaa

Manishiki Manishe Dhooramugaa
Idhi MaayaLokapu Dharmamuraa
Badilo Cheppani Paatam Idhiraa
Bathuke Nerchuko Naa Kodukaa

Thidithe Vaallaki Thagilenu
Ninu Kottina Chethulu Virigenu
Oddhika Nerchi Orchukunundu
Opikathoti Naa Kodukaa

Raallu Rappala Daarullo Neevi
Adugulu Padhilam O Kodukaa
Metthati Kaallu Otthukupothai
Choosuku Naduvura Naa Kodukaa

Chukkalu Dhikkulu Nesthulu Neeku
Chakkaga Bathuku O Kodukaa
Okkanivanukoni Digulaipoku
Pakkane Untaa Naa Kodukaa

Paanamu Needhi Pittala Thotidhi
Uchhula Padaku O Kodukaa
Mullakampalo Goodu Kattero Nerputho
Edhagara Naa Kodukaa

Ye Daarilo Nuvvu Pothunnaa
Ye Gandam Neeku Edhurainaa
Ye Keedu Ennadu Jaragadhu Neeku
Amma Deevenidhi Naa Kodukaa

Ee Dikkulu Neetho Kadhilenu
Aa Chukkale Dishti Teesenu
Ye Gaali Dhooli Sokadhu Ninnu
Amma Deevenidhi Naa Kodukaa

Ye Pidugula Chappudu Vinabadinaa
Yee Bhoochodiki Nuvu Bhayapadinaa
Ye Cheekati Ninnem Cheyadhuleraa
Amma Deevenidhi Naa Kodukaa
Amma Deevenidhi Naa Kodukaa…

ఆ ఆ ఆఆ ఆ ఆ…..
పచ్చా పచ్చని చేలల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతు నడిచేద్దాము
చేతులు పట్టుకొ….. నా కొడుకా

కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్నంటుకునీ
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను…. నా కొడుకా

పదిలంగా నువు నడవాలే
పది కాలాలు నువు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తది… నా కొడుకా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ…
ఆకలితో నువ్వు పస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేరా…!
చెట్టు చెట్టుకీ చెబుతున్నా
నీ కడుపు నింపమని… నా కొడుకా

నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగ మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని… నా కొడుకా

మనిషికి మనిషే దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతుకే నేర్చుకో… నా కొడుకా

తిడితే వాళ్ళకి తగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి…. నా కొడుకా

రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతయ్…
చూసుకు నడువుర… నా కొడుకా

చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగ బతుకు ఓ కొడుకా…
ఒక్కనివనుకొని దిగులైపోకు
పక్కనె ఉంటా నా కొడుకా…

పాణము నీది… పిట్టల తోటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా…
ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో
ఎదగర నా కొడుకా…

ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఎదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దీవెనిది… నా కొడుకా

ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలె దిష్టి తీసేను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మదీవెనిది… నా కొడుకా

ఏ పిడుగుల చప్పుడు వినబడినా
ఏ భూచోడికి నువు భయపడినా
ఏ చీకటి నిన్నేం చేయదులేరా
అమ్మ దీవెనిది నా కొడుకా…
అమ్మ దీవెనిది నా కొడుకా…

నా కొడుకా (Naa Koduka) Song

YouTube లో నెటిజన్ల స్పందనలు కొన్ని చూద్దాం….

మాములు పాట కాదు బాబు…ఇలాంటి స్వచ్చమైన పదాలు స్పష్టంగా వినకా ఎన్నాళ్లైంది.దేవి గ్రేట్.. @@anjugoudsakshitv9520

వెంట వెంటనే 10 సార్లు విన్నాను ఈ పాట 🙏🙏🙏 అమ్మ వచ్చి చెప్పి వెళ్లినట్టు ఉంది పాట.. Miss u అమ్మ 😢😢😢.. ఈ పాట రూప కల్పనలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏 Love This Song My Life Time 💙💙💙 — @@@rameshmanda

అమ్మ చనిపోయి 22 సంవత్సరములు అవుతుంది కానీ ఈరోజు మా అమ్మ నా పక్కన ఉండి నాకు చెప్పినట్టుగానే ఉంది థాంక్స్ కిషోర్ — @radhakrishnabashaboina

అమ్మ పదే పదే పలకాలి అనుకున్న పదాలని ఎంతొ బాగా గ్రహించి పాటుగా రాసిన మీకు అమ్మ లందరి తరఫునా శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాభినందనలు. — @jayasreem

ఈ లిరిక్స్ రాసిన వ్యక్తి యొక్క పాదాలకి కొన్ని వేల కోట్ల వందనాలు ఒక్కొక్క పదం వింటుంటే కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తుంది నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.. — @vijaynenavath

You may also like

Leave a Comment