నాగ చైతన్య సాయి పల్లవి లవ్ స్టోరి

‘ఫిదా’ చిత్రం తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఈ చిత్ర టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్
ను సంక్రాంతి పండగ సందర్భంగా ట్విట్టర్ వేధికగా విడుదల చేశారు. మొదటిసారి నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది.

ఆకట్టుకునేలా ఉన్న ఈ ఫోస్టర్ లో హీరోయిన్ సాయిపల్లవి హీరో నాగ చైతన్య చొక్కా పట్టుకొని భావోద్వేగానికి లోనౌతూ కనిపిస్తుంది. శేఖర్ కమ్ములకు సాయి పల్లవితో ఇది రెండవ చిత్రం. ఎమోషనల్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో చెప్పాడు దర్శకుడు. మాములుగా అయితే ప్రేమ కథా చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్ లు కొంచెం రొమాన్స్ ఉండేలా చూసుకుంటారు.

శేఖర్ కమ్ముల చిత్రం అంటే క్లాస్ ప్రేక్షకుల్లో ఒక పెద్ద అంచనా ఉంటది. ఈ అంచనాలను అందుకుంటాడో చూడాలంటే వేసవి కాలం
వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది.

ఇది కూడా చదవండి: రవితేజ క్రాక్ సంక్రాంతి పోస్టర్