బిగ్ బాస్ 3 కాన్‌ కే నీచే క్యా దేతే రే. బిగ్‌బాస్‌ హౌస్‌లో శని ఆది వారాలు వచ్చాయంటే సందడి నెలకొంటుంది. ‘లెట్స్ డు కుమ్ముడు’ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, హౌస్ మేట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించారు.

అలీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

షో మొదలవడమే ఆలస్యం అలీని ముందుకు పిలిచిన నాగ్ 21 గుంజీలు తీయమని ఆదేశించాడు.

చిన్న పిల్లల్ని స్కూల్ లో గుంజీలు తీయిస్తే తప్పు, కాని వయసు వచ్చిన మీలాంటి వారు తప్పులు చేస్తుంటే గుంజీలు తీయిన్చాల్సిందే. నీ డ్రెస్ సెన్స్ బాగుంది కానీ కామన్ సెన్సే లేదు, ఆడపిల్ల మీద అలానేనా అరిచేది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నాగార్జున.

ఆలీ మరియు హిమజ మధ్య జరిగిన టాస్క్ లో అలీ ప్రవర్తన సరిగా లేదని, దొంగ చేయాల్సిన పని నువ్వు చేశావని అలీ రెజా ప్రవర్తన గురించి మాట్లాడాడు. మగాడు తన పర్మిషన్ లేకుండా ఆమె మీద చేయివేస్తే తంతుంది, అది ఆడవారి స్వభావం. అలానే చేయాలి. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బయట కూడా అంతే అంటూ హిమజకు మద్దతుగా నిలిచాడు నాగార్జున.

హౌస్ మేట్స్ ని తప్పు పట్టిన నాగ్

కాలుతో తన్నినందుకు కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరినప్పటి అరుస్తూనే ఉన్నావు. అదేదో కాన్ కే నీచే…. కాన్‌ కే నీచే క్యా దేతే రే.. బోల్.. కాన్ కే నీచే…  అంటూ అలీపై ఫైర్ అయ్యారు. ఏంటి, హౌస్ మేట్స్ గొంతులు మూగబోయాయా, ఒక అబ్బాయి అమ్మాయి మీద అరుస్తుంటే అందరూ గ్రూప్స్ గ్రూప్స్ అయిపోయారా, హిమజ మీ గ్రూపులో లేదనా, ఆ అమ్మాయి బాత్ రూంలోకి వెళ్లి ఏడుస్తుంటే ఎవరు సపోర్ట్ చేయలేదే, మగవాడికైనా ఆడవారికైనా మీ ముందు అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా స్పందించాలి అంటూ మిగతా హౌస్ మేట్స్ కి చురకలు అంటించారు నాగ్.

ఈ మొత్తం ఎపిసోడ్ లో తమ్మనా ఒక్కతే గట్టిగా తన వాయిస్ వినిపిస్తూ ఆ అమ్మాయికి మద్దతుగా నిలిచింది. తమ్మన్నా ముందుకొచ్చి, ఎందుకరుస్తున్నావు సారీ చెప్తున్నా అంటూ గట్టిగా ఆపింది అంటూ తమన్నాను మెచ్చుకున్నారు.