Neeli Meghala Pallaki Folk Song Lyrics penned by Mahender Mulkala, music composed by Praveen Kaithoju, and sung by Srinidhi & Boddu Dhilipkumar.
Neeli Meghala Pallaki Folk Song Credits
Lyrics | Mahender Mulkala |
Music | Praveen Kaithoju |
Singers | Boddu Dilip, Srinidhi |
Category | Telangana Folk Song Lyrics |
Song Label |
Neeli Meghala Pallaki Folk Song Lyrics
నీలి మేఘాల పల్లకి మీద
నెమలి కన్నుల ఓ పిల్ల నీలా
వేగు సుక్కల వెలుగుల మీద
మొగలి వన్నెల ఓ మేన బావ
పాల మబ్బుల పడవలు గట్టి
మంచుకొండల మత్తడి దాటి
నిండు పున్నమి వెన్నెల రావే
నిన్ను జూడ వెయ్యి కండ్లు సాలవే
పచ్చ జొన్నల పైరుల కాడ
పండు వెన్నెలతో రాసే
రంగుల ఓ సింగిడి బావ
సాలు సాలు సరసాల మాట
నీలి మేఘాల పల్లకి మీద
నెమలి కన్నుల ఓ పిల్ల నీలా
మంచు కురిసిన
మల్లె గంధాల మీద
హంస నవ్వులదాన
అందాల భామ
పాల నవ్వుల లేత పరవల్ల మీద
వలపు సూపులు ఏల వరసైన బావ
మంచు కురిసిన
మల్లె గంధాల మీద
హంస నవ్వులదాన
అందాల భామ
పాల నవ్వుల లేత పరవల్ల మీద
వలపు సూపులు ఏల వరసైన బావ
సంకురాతిరి ముగ్గులు వేసే
సందమామ నిన్ను సాటుంగ జూసి
నల్ల నల్లని నా కన్నుల నిండా
కట్టినానే నీకు వెన్నెల గూడు
మాయ జేసే తేనె మాటలతోని
సైగ చేసె కొంటె సూపులతోని
అందమైన పల్లె బంధాలవాడ
అల్లమాకు నామీద ప్రేమ
నీలి మేఘాల పల్లకి మీద
నెమలి కన్నుల ఓ పిల్ల నీలా
పంచె వన్నెల రంగు పరువాల బొమ్మ
వలసినానే నిన్ను వయ్యారి భామ
సన్నజాజిరి వన్నె అందాల మీద
సొమ్మసిల్లినవోయి ఓ మేనబావ
పంచె వన్నెల రంగు పరువాల బొమ్మ
వలసినానే నిన్ను వయ్యారి భామ
సన్నజాజిరి వన్నె అందాల మీద
సొమ్మసిల్లినవోయి ఓ మేనబావ
నీలి రంగుల చీరెను గట్టి
నింగి తారలన్ని పూలుగ వెట్టి
కొత్త సింగారాల వెన్నెల వోలె
వెలిగినావే ఈ సందె వేళా
సన్నెపొద్దులా సూర్యుని వోలె
సంబురాల నీ ప్రేమలు జాలె
ముత్యమల్లె ఓ ముద్దుల బావ
మురుసుడేలా లోకాలు మరిసి
నీలి మేఘాల పల్లకి మీద
నెమలి కన్నుల ఓ పిల్ల నీలా
ఎండ నీడల వోలె వీడలేని తోడై
వేయి జన్మల సాటి నేనుంట నీల
మొగలి ముద్దుల వన్నె మురిపాల మీద
మనసు కలిసినవాడ ఓ మేన బావ
ఎండ నీడల వోలె వీడలేని తోడై
వేయి జన్మల సాటి నేనుంట నీల
మొగలి ముద్దుల వన్నె మురిపాల మీద
మనసు కలిసినవాడ ఓ మేన బావ
ముద్ద బంతులు మెరిసే రంగుల వోలె
మబ్బు లేని వాన సినుకులు జారె
హద్దు దాటి ఓ ముద్దుల భామ
అల్లుకోవే మల్లెతీగోలే
దూర దూరాల తీరాలు దాటి
గోరువంక వోలె నా సెంత జేరి
జంటగోరె నా ముద్దుల బావ
జన్మ జన్మల తోడై ఉంటా