నిఖిల్ 18 పేజీస్ – ఇదే సినిమా టైటిల్, కుమారి 21 ఎఫ్ డైరెక్ట‌ర్ తో కొత్త సినిమా

నిఖిల్ 18 పేజీస్

నిఖిల్ తన తదుపరి చిత్రానికి ’18 పేజీస్’ అనే ఆసక్తికర టైటిల్ ను ప్రకటించి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు ‘అర్హ’ ఈ చిత్రానికి క్లాప్ కొట్టడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం విడుదల చేసింది. ’18 పేజీస్’ చిత్రానికి సుకుమార్ కథను అందించగా అల్లు అరవింద్ జిఏ2 ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించనున్నాడు. గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.

18 Pages Movie Launch Photos

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here