సంక్రాంతి పండగ పురస్కరించుకొని నితిన్, రష్మిక మందన జతగా తెరకెక్కుతున్న ‘భీష్మ’ చిత్ర టీజర్ విడుదల చేసింది
ఆదివారం నాడు చిత్ర బృందం. టీజర్ చూస్తుంటె కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతుంది.
టీజర్ లో నితిన్ చెప్పే డైలాగ్ లు భలే సరదగా ఉన్నాయి. ముఖ్యంగా చివర్లో వెన్నెల కిషోర్ తో చెప్పే డైలాగు నవ్వుతెప్పిస్తుంది. “ఎవరి వాల్యూ అయినా బతికున్నప్పుడు కంటే చనిపోయాకె పెరుగుతుంది భయ్య” అని నితిన్ చెప్పగా ‘అదెలా’ అని కిషోర్ అడుగతాడు, దానికి నితిన్ “ఓ కోడి బతికున్నప్పుడు కిలో 90 రూపాయలు, అది చనిపోయాక కిలో 190 రూపాయలు” అని బదులిస్తాడు.
వెంకి కుడుముల దర్శకత్వంలో వస్తున్న భీష్మ చిత్రం 21 ఫిబ్రవరి 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ మీరూ ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి: సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు పాట ప్రోమో