ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాసిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈచిత్రంలోని
5 పాటలు విడుదల చేసినా ఇంకా ఒక పాటను మాత్రం చిత్ర బృందం విడుదల చేయలేదు. ఆపాట చిత్ర క్లైమాక్స్ లో వస్తుంది. పాటకు అనుగుణంగా ఫైట్ సీన్ ఉంటుంది.
అల వైకుంఠపురములో క్లైమాక్స్ – సిత్తరాల సిరపడు.. పాట
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు..
పట్టుపట్టినాడ ఒగ్గనే ఒగ్గడు…
పెత్తనాలు నడిపెడు సిత్తరాల సిరపడు..
మంతనాలు చేసినాడు సిత్తరాల సిరపడు…..
ఉత్తరాల ఊరిచివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. అంటూ సాగే పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ‘స్థానం మారినా స్థాయి మారదు’ అనే కాన్సెప్టుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకొచ్చిన వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం సినీ అభిమానులను మెప్పించింది అని చెప్పొచ్చు.
సిత్తరాల సిరపడు..Telugu Lyrics
సినిమా విడుదల సందర్బంగా చిత్ర బృందం ‘సంక్రాంతి విన్నర్’ ప్రోమోను విడుదల చేసింది.