ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి – కేంద్రం తాజా ప్రకటన

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి అని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుండి అంటే ఏప్రిల్ 20, 2020 నుండి కేంద్రం ఈ-కామర్స్ సంస్థలకు వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఇందులో ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరం లోని వస్తువులకు లాక్ డౌన్ సమయంలో అనుమతి లేదని ఈ సందర్భంగా తెలిపింది.

ఈ-కామర్స్ కంపెనీలు నిత్యావసరాలే సరఫరా చేయాలి

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు ఇతర ఈ-కామర్స్ కంపెనీల ద్వారా అన్ని వస్తువులు (నిత్యావసరం కానివి) ఈ నెల 20 నుండి కొనుగోలు చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనతో వినియోగదారులకు ఇప్పుడే తమకు కావాల్సిన అన్ని వస్తువు లభించవు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఈ-కామర్స్ కంపెనీలు కఠినంగా పాటించాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. నిత్యావసరాలు డెలివరీ చేసే వారికి తగిన అనుమతులు ఇస్తున్నట్టు కూడా తెలిపింది ప్రభుత్వం.

Read Also: Today Gold Price