O Nirmala Bathukamma Song Lyrics in Telugu & English – ఘల్లు ఘల్లునా ఓ నిర్మల

O Nirmala Bathukamma Song Lyrics
Pic Credit: Dr.SHRAVAN (YouTube)

O Nirmala Bathukamma Song Lyrics. Ghallu Ghalluna O Nirmala Bathukamma Song Lyrics.

O Nirmala Bathukamma Song Lyrics In English

Banthi Poodhotalanni Bangaru Varnamai
Bathukamma Roopamai Merisene
Erra Kaluvaa Poolu Cheruvu Thalli
Nudhuti Meeda Sindhooramaddhinattu Virisene

Ghallu Ghallunaa… Ghallu Ghallunaa
Gaajula Chappatlatho O Nirmala
O Nirmala Laalitha Aatalaadare, O Nirmala
O Nirmala Laalitha Aatalaadare, O Nirmalaa

Pasupu Kommullaa… Pasupu Kommulla
Gouramma Roopamaayene O Nirmala
O Nirmala Laalitha Aadipaadare, O Nirmalaa
O Nirmala Laalitha Aadipaadare, O Nirmalaa

Listen ఓ నిర్మల బతుకమ్మ Paata


Song Soure: Dr.SHRAVAN (YouTube)
Category: Bathukamma Song


O Nirmala Bathukamma Song Lyrics In Telugu

బంతీ పూదోటలన్ని బంగారు వర్ణమై
బతుకమ్మ రూపమై మెరిసెనె
ఎర్రకలువా పూలు చెరువు తల్లి
నుదిటి మీద సింధూరమద్దినట్టు విరిసెనె

ఘల్లు ఘల్లునా… ఘల్లు ఘల్లునా
గాజుల చప్పట్లతో ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత ఆటలాడరే, ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత ఆటలాడరే, ఓ నిర్మలా

పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్ల
గౌరమ్మ రూపమాయెనే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత ఆడి పాడరే, ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత ఆడి పాడరే, ఓ నిర్మలా

పట్టు చీరల్లా… అక్క చెల్లల్ల
మైదాకు చేతులతో ఓ నిర్మలా
ఓ నిర్మల లాలీత దరువెయ్యరే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత దరువెయ్యరే ఓ నిర్మల

చేమంతుల్ల పూబంతుల్ల బంగారు
బతుకమ్మలే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత బైలెల్లెనే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత బైలెల్లెనే ఓ నిర్మల

గంగ మురిసేనే… గంగ మురిసేనే
బతుకమ్మ పూలచీరతో ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత పూల ఏరులే ఓ నిర్మల
ఓ నిర్మల లాలీత పూల ఏరులే ఓ నిర్మలా

హొ హొ హొ హొ… హొ హొ హొ హొ
హొయ్ హొయ్ హొయ్… హొయ్ హొయ్ హొయ్

వచ్చింది వచ్చింది… పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ… పసిడీ వన్నెల పల్లెకూ
తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు
మా పల్లె ముంగిల్లకూ… ముగ్గుల్ల వాకిల్లకూ

తంగేడు గుమ్మడి గునుగు చామంతుల
పువ్వుల పల్లకి మా తల్లికీ
మా చేతుల్లో నిండిన జాబిల్లికీ
పసుపేమో పచ్చంగ… కుంకుమ ఎర్రంగ
తీరొక్క పూజలు మా తల్లికీ
మా బతుకు వెలిగించేటి బతుకమ్మకీ

వచ్చింది వచ్చింది… వచ్చింది వచ్చింది
వచ్చింది వచ్చింది… పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ… పసిడీ వన్నెల పల్లెకూ

గునుగూ పూలు గోయంగా
గునుగూ పూలు గోయంగా
గువ్వా లాలీ రాయే
గునుగూ పూలు గోయంగా

గునుగూ పూలు గోయంగా
గునుగూ పూలు గోయంగా
గువ్వా లాలీ రాయే
గునుగూ పూలు గోయంగా

బంతీ పూలు పేర్చంగ
బంతీ పూలు పేర్చంగ
బతుకమ్మ నవ్వెనే
బంతీ పూలు పేర్చంగ

బంతీ పూలు పేర్చంగ
బంతీ పూలు పేర్చంగ
బతుకమ్మ నవ్వెనే
బంతీ పూలు పేర్చంగ

తంగేడు పూలతోని… తంగేడు పూలతోని
తల్లీ గంగ జేరెనే… తంగేడు పూలతోని
తంగేడు పూలతోని… తంగేడు పూలతోని
తల్లీ గంగ జేరెనే… తంగేడు పూలతోని

యే లో యే లో… యే లో యేలో
హొయ్ హొయ్… హొయ్యారె హొయ్యారె
హొయ్యారె హొయ్యారె

చుక్కలాలో ఓ చుక్కలాలో
చూసి మురవండే బతుకమ్మనీ
చూసి మురవండే బతుకమ్మనీ

నేరియాలో అల్లా నేరల్లో
కొలువ రారండే గౌరమ్మనీ
కొలువ రారండే గౌరమ్మనీ

అమ్మలాలో ఓయమ్మలాలో
పంచిపెట్టండే సద్దులనీ
ఆ ముగ్గురమ్మల ఏకం చెయ్యరె
గంగా గౌరీ బతుకమ్మనీ
గంగా గౌరీ బతుకమ్మనీ

వచ్చింది వచ్చింది పండుగ సందడి
పచ్చా పచ్చని పల్లెకూ
పాడి పంటల సీమకూ

వచ్చింది వచ్చింది పండుగ
సందడి పచ్చా పచ్చని పల్లెకూ
పసిడీ వన్నెల పల్లెకూ
పచ్చా పచ్చని పల్లెకూ
పాడి పంటల సీమకూ

గమనికఈ పాటను రచించిన వారు/సేకరించినవారు, పాడినవారు మరియు సంగీతం అందించిన వారి వివరాలు ఎవరికైనా తెలిసినచో దయచేసి క్రింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.