ఓ రాస గుమ్మాడి బతుకమ్మ లిరిక్స్ కృష్ణవేణి మల్లవజ్జల మరియు రజిత సాహిత్యానికి కార్తిక్ బి కొడకండ్ల సంగీతాన్ని అందించగా తేలు విజయ, రజిత మరియు అశ్విని రాథోడ్ ఈ పాటను పాడారు.

ఓ రాస గుమ్మాడి బతుకమ్మ Song Credits

Song Category Bathukamma Song
Lyrics Krishnaveni Mallavajjala, Rajitha
Singers Telu Vijaya, Rajitha, Ashwini Rathod, Shri Dhruthi
Music Karthik Kodakandla
Ft Naga Durga, Telu Vijaya
Song Lable 9Vibes News

ఓ రాస గుమ్మాడి బతుకమ్మ లిరిక్స్

పొడిసేటి పొద్దుల్లో
పచ్చాని వాకిట్లో
సప్పట్ల తాళాలో ఎన్నియాలో
తీరొక్క రంగుల్లో
పూవుల్ల దారుల్లో
బతుకమ్మ కదిలిందో పల్లెలల్లో

ఎల్లలోకాలు గాసేటి గౌరమ్మ
పూల దోసిట్లో ఎలిసేనే
సల్లగా మమ్ము జూడవే బతుకమ్మ
అంటూ జనులంతా కొలిసేనే

జోరు పాటల్ల ఆటల్ల
గజ్జల్ల దరువుల్ల
పండుగొచ్చినాదే
(పండుగొచ్చినాదే)

పొడిసె పొద్ధోలె ముద్దుగ వచ్చేనె
ఓ రాస గుమ్మాడి
అరె ఓ రాస గుమ్మాడి
పువ్వుల్ల కొమ్మల్ల వనమంత కదిలేనే
ఓ రాస గుమ్మాడి
అరె ఓ రాస గుమ్మాడి

ఆకుల్ల తాంబాలమే పీటమయ్యింది
ఓ రాస గుమ్మాడి
అరె ఓ రాస గుమ్మాడి
పొంగేటి వాగుల్ల వంకల్ల వస్తదే
ఓ రాస గుమ్మాడి
అరె ఓ రాస గుమ్మాడి

ఒక్కేసి పువ్వందునా గౌరమ్మ
ఒక్క అరిటాకందునా గౌరమ్మ
ఒక్కేసి పువ్వందునా గౌరమ్మ
ఒక్క అరిటాకందునా గౌరమ్మ

అరిటాకు శెక్కర శనిగ పూ సైగలు
సేరెండి కడియాలు
బతుకమ్మ నీ పాటలు గౌరమ్మ
బాలలకు జో పాటలు గౌరమ్మ

ఎడ్ల గొడ్లను కట్టె ఏముడాల రాజన్న
నీకేను దొరికినాది గౌరమ్మ
నీ గుల్లు జేరినాది గౌరమ్మ
బంగారి ఓనమాలో గౌరమ్మ
ముత్యాల గుండ్ల వనమే గౌరమ్మ

కట్లా సప్పులతో కడియాలు సేపిత్తు
కాకరపూలతో కాళ్ళ గజ్జెలు వెడ్దు
ఎర్రాని మందార ఏల్ల మట్టెలు పెడ్దు
గోరెంట పూలతో గోటుంగురాలేత్తు

మూలిగాయి పువ్వుతో ముక్కూ పుడక వెడ్దు
శనగాయి పూలతో సేతి గాజులేత్తు
గుమ్మడి పూలోలే గుత్తులు వెడుదు
కమలమ్మ పూలోలె కమ్మలు వెడుదు
మల్లెలు మొల్లెలు మంచి విరజాజులు
అల్లిబిల్లిగ అల్లి అల్లిపూలతోటి
హారమ్ము నీకేత్తునే గౌరమ్మ

ఒక్కేసి పువ్వందునా గౌరమ్మ
ఒక్క అరిటాకందునా గౌరమ్మ
ఒక్కేసి పువ్వందునా గౌరమ్మ
ఒక్క అరిటాకందునా గౌరమ్మ

వేల కళ్ళతోనే లోకమంతా ఏల
వేలుపు వెడలిన వేళా
సూడ రెండు కళ్ళు ఏడ సాలునంట
గౌరమ్మ నీదైన లీలా

పచ్చ పచ్చనైన సీర సుట్టుకోని
బొట్టెట్టి పిలిసింది నేలా
మమ్ము గాచిపోను వచ్చేనంట
అమ్మ బంగారు బతుకమ్మా

బంగారు గుండ్ల వనమే గౌరమ్మ
దొంగలేమో దోసిరో గౌరమ్మ
బంగారు గుండ్ల వనమే గౌరమ్మ
దొంగలేమో దోసిరో గౌరమ్మ

పసుపు కుంకుమతోని పాపట బిల్లేత్తు
సీతజడలతోని సిగకొప్పులే ఇత్తు
కట్ల కట్లపూలు కడియాలు జేపిత్తు
బొడ్డుమల్లెలు దెచ్చి ఒడ్డాలమేపిత్తు

పట్టు కుచ్చు పూల పైటను జేపిద్దు
చిట్టి బందీపూల సింగులు కట్టిద్దు
గునుగు తంగేడులు దాసాన గన్నేర్లు
చల్లా గుత్తి పూలు కాశీరతనమ్ములు
అన్నీ పూలు దెచ్చి ఆర్తి తోడ కొడ్దు

మూడు కన్నుల వాని
ముద్దుల మా రాణి
సల్లంగ మము గాయవే గౌరమ్మా

యాట వచ్చేరమ్మ యాట వోయేరు
యాట మన ఇండ్లల్ల పండుగలు గలుగ
ఎల్లి రా గౌరమ్మ ఎల్లి రావమ్మ
మళ్ళొచ్చే ఏటికి మరలి రావమ్మా
ఎల్లి రా గౌరమ్మ ఎల్లి రావమ్మ
మళ్ళొచ్చే ఏటికీ మరలి రావమ్మా

Watch పొడిసేటి పొద్దుల్లో Video Song