‘నమస్తే ట్రంప్’ అనే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా గుజరాత్ లోని
అహ్మదాబాద్ నగరాన్ని, యూపీ మరియు ఢిల్లీ ప్రదేశాలను సందర్శించడానికి 24, 25 తేదీల్లో ఆయన పర్యటన అధికారిక
షెడ్యూల్ ను విడుదల చేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన అధికారిక షెడ్యూల్
సోమవారం, 24 ఫిబ్రవరి 2020
11:40 గంటలు: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొంటారు.
12:15 గంటలు: సబర్మతి ఆశ్రమం (అహ్మదాబాద్)ను సందర్శిస్తారు.
13:05 గంటలు: మొతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ లో పాల్గొంటారు.
15:30 గంటలు: ఆగ్రాకు బయలుదేరుతారు.
16:45 గంటలు: ఆగ్రా చేరుకుంటారు.
17:15 గంటలు: తాజ్ మహల్ సందర్శన చేసుకుంటారు.
18:45 గంటలు: ఢిల్లీకి బయలుదేరుతారు.
19:30 గంటలు: ఢిల్లీ చేరుకుంటారు.
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020
10:00 గంటలు: రాష్ట్రపతి భవన్‌లో జరిగే స్వాగత కార్యక్రమానికి ట్రంప్ హాజరుకానున్నారు.
10:30 గంటలు: రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు సమర్పిస్తారు.
11:00 గంటలు: హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నత స్థాయి సమావేశం.
12:40 గంటలు: హైదరాబాద్ హౌస్ వద్ద ఒప్పందాల మార్పిడి / మీడియా సమావేశం.
19:30 గంటలు: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో సమావేశం కానున్న ట్రంప్.
22:00 గంటలు: ట్రంప్ అమెరికా తిరుగు ప్రయాణం