Home » ట్రైలర్/ టీజర్ » Palasa 1978 Telugu Movie Trailer – 1989 లో ఫిబ్రవరి 4న పలాస మార్కెట్ లో జరిగిన హత్య కేసయ్యా ఇది

Palasa 1978 Telugu Movie Trailer – 1989 లో ఫిబ్రవరి 4న పలాస మార్కెట్ లో జరిగిన హత్య కేసయ్యా ఇది

by Devender

నిజ జీవితంలోని వ్యక్తుల ఆధారంగా నిర్మించిన ‘పలాస 1978’ తెలుగు చిత్ర ట్రైలర్ ను ఈరోజు (01.03.2020) రానా
దగ్గుబాటి విడుదల చేశారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్ మరియు నక్షత్ర హీరో హీరోయిన్లుగా నిట్టిస్తున్న ఈ చిత్రాన్ని
ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భారద్వాజ సమర్పణలో రఘు కుంచె సంగీతాన్ని సమకూర్చారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ‘1989 లో ఫిబ్రవరి 4న పలాస మార్కెట్ లో జరిగిన హత్య కేసయ్యా ఇది’ అని లాయర్ – జడ్జ్ కు చెప్తున్న డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఇలా చెప్పడంతోనే సినిమా కథ అర్థం అవుతుంది.

‘సొంత తమ్ముణ్ని చంపాలంటే ఆలోచన వస్తది, తప్పులేదు…కానీ, మనం ఎదగడం కోసం చేసే ఏ పని కూడా తప్పు కాదు… బురదలోనికి దిగిపోయినం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు.. ఎవడెప్పుడొచ్చి మా పీక తీసుకెళ్ళిపోతాడని భయంగా ఉంటాదే.. అన్నదమ్ములిద్దరూ ఒక్కసారే అయిపోవాలె, ఎవ్వడు మిగిలిన కష్టమే’ వంటి పవర్ ఫుల్ డైలాగులతో టీజర్ సాగిపోతు నిజఘటనలను తలపిస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ లా కనిపిస్తాడు. హీరో మరియు కనిపించే ఇతర పాత్రలు సన్నివేశాలకు దగ్గట్టు బాగానే నటించారు. ఉత్తరాంధ్ర జానపద పాటలు, రఘు కుంచె నేపథ్య సంగీతం మైమరిపించాయి.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 6న విడుదలకు సిద్ధమైంది ‘పలాస 1978’ చిత్రం. ట్రైలర్ మీరు చూసేయండి.

Palasa 1978 Telugu Movie Trailer

 

You may also like

Leave a Comment