Home » Telangana Folk Song Lyrics » Puttedu Dukkham Song Lyrics – Folk Song Telugu

Puttedu Dukkham Song Lyrics – Folk Song Telugu

Puttedu Dukkham Song Lyrics penned by Mukkapally Srinivas, music composed by Praveen Kaithoju, and sung by Srinivas & Mukkapally Bhargavi.

Puttedu Dukkham Song Credits

SongTelangana Folk Song
DirectorParshuram Nagam
SingersMukkapally Srinivas & Mukkapally Bhargavi
MusicPraveen Kaithoju
LyricsThallapally Suresh Goud
CastLasya, Karthik, Srinivas, Bhargavi
Music Label

Puttedu Dukkham Song Lyrics

Puttedu Dhukamutho Puttinillu Vodhunaa
Avushayinchi Avvagaari Illu Ne Jeranaa
Sinnanaade Thallidhandri Dhooramaithe
Kashtaame Thelavakunda Anni Thaanaina Annaa

పుట్టేడు దుఃఖముతో పుట్టినిల్లు వోదునా
అవుశయించి అవ్వగారి ఇల్లు నే జేరనా
సిన్ననాడే తల్లిదండ్రి దూరమైతే
కష్టామే తెల్వకుండా అన్నీ తానైన అన్నా

అమ్మాగల్ల అన్నకేమంట జెప్పుదునో
బాధ జెప్పి మళ్ళ భారామెట్ల అయిదునో

పుట్టీనింటి గడప దాటినావు చెల్లి
మెట్టీనింట అడుగు పెట్టినావు తల్లి
మా ఇంటి దీపమా మా కంటి రూపమా
పావురంగ సాదుకున్న గావురాల మూటవో

ఘల్లూ ఘల్లూన ఇల్లు తిరుగుతుంటే శెల్లె
మువ్వాల సవ్వాడికి నవ్వులే విరజిల్లే

రావాలనున్నది అన్న మన ఇంటికి
రందీతోని కునుకు లేకపాయె కంటికి
నవ్వులై ఎలిగితిమి పుట్టినింటిలోన
పుట్టేడు కష్టమాయె మెట్టినింటిలోన

ఎదలో దాగిన దుఃఖం ఎల్లబోసుకోవాలే
భారమైన గుండె బరువు దించుకోవాలే

రావమ్మా చెల్లి నా బంగారు తల్లి
రమ్మాని పిలిసే పుట్టింటి గడప మళ్ళీ
అత్తాగారిల్లు జేరి ఆరునెల్లు ఆయే
అడుగు సవ్వడి లేక ఇల్లు సిన్నాబోయే

అన్నా గుండె తల్లడిల్లిపోయేనమ్మా
నిన్నూ జూడ బయలుదేరి వస్తినమ్మ

ఇగురాముగల్లోడని ఇచ్చినావు అన్నా
ఇంగీతమే లేని ఇంట్ల బతుకుతున్న
గువ్వల జంటోలే కూడి ఉందామంటే
గుట్టూ సప్పుడు గాక జేస్తి సంసారం

ఎంతా కాలమని ఎల్లాదీద్దునన్నా
ఏగాలేక ఎళ్ళీ పోదామనుకున్నా

ఎంగీలి పాలు తాగి ఎదిగీన సెల్లే
ఎడబాటు రావాలంటే సావే రావాలే
సేవా సావలేదు శక్తీ నాకుంది తల్లి
చెమటా సుక్కలు జల్లి నిన్నూ సాదుకుంటా

సెట్టూకు కాయె ఎప్పుడు బరువు కాదు శెల్లే
సెంచారిళ్లకు శెల్లే శెంత అన్నా ఉండే
విగతాజీవీవైతే వింత ఏముందమ్మా
విధిని ఎదురించి బతుకు పోరూ జెయ్యాలమ్మా
విధిని ఎదురించి బతుకు పోరూ జెయ్యాలమ్మా

Watch పుట్టేడు దుఃఖముతో Video Song

Scroll to Top