కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం చాలా చేబడుతుంది. ఇందులో భాగంగా రాచకొండ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

కరోనా వైరస్ నివారణకు రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం – వ్యక్తిగత పరిశుభ్రతే కరోనా వ్యాధికి నివారణ

ట్రాఫిక్ కూడళ్ల వద్ద రాచకొండ పోలీసులు చేస్తున్న వైరస్ నిర్మూలన నియమాలు అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఊరికే మైకుల్లో మాటలకే పరిమితం కాకుండా చేతులు ఎలా కడుక్కోవాలో, ఇతరులతో ఏవిధంగా మెలగాలో మొదలగునవి చేస్తూ చూపిస్తున్నారు. పోలీస్ కమీషనర్ గారి అద్భుతమైన ఆలోచనను ప్రజలు స్వాగతిస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసులు సూచించిన సూచనలు

  1. చేతులను శుభ్రంగా కడుక్కోవ్వాలి.. ఎలా కడుక్కోవాలో కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ చూపించారు పోలీసుల బృందం
  2. 20 సెకండ్లకు తగ్గకుండా శుభ్రంగా కడుక్కోవాలి
  3. తుమ్ము, దగ్గు వచ్చినా ఇలా చేయండి అని చూపించారు కోవిడ్ 19 ట్రాఫిక్ పోలీస్
  4. ప్రతీ వ్యక్తికి ఒక మీటర్ దూరంలో ఉండండి
  5. ఎవరైనా కలిస్తే షేక్ హాండ్స్ ఇవ్వకుండా నమస్కారం మాత్రమే చేయండి
  6. కరోనాను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యం

మీరు అందుకు సంబంధించిన వీడియో చూసి పాటించండి..

Also Read: Covid19 – Chiranjeevi Precautions