Rahul Sipligunj Reaction on PUB Attack – రాహుల్‌ సిప్లిగంజ్‌ మీడియా ముందుకు

Rahul Sipligunj Reaction on PUB Attack
Pic Credit: V6 News (YouTube)

హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై తలపై బీరుసీసాలతో దాడి సంఘటన తెలిసిందే. అయితే ఈ దాడి ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడాడు.

దాడి చేసిన వాళ్ళు వాష్ రూమ్ కు వెళ్లి వస్తూ అసభ్యంగా మాట్లాడుతూ డాష్ ఇస్తూ వెళ్తుంటే నేను వారిని ఆపి అడిగా, వారు దాదాపు 15 మంది ఉన్నారు, కావాలని గొడవ పెట్టుకొని బీరు సీసాలతో దాడి చేశారు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందనే వాళ్లు రుబాబు చూపించారు అని రాహుల్ చెప్పాడు.

వారు తెలుసా ? ఎప్పుడైనా కలిశావా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నాకు వాళ్ళతో పరిచయం లేదు, నేనెప్పుడూ చూడలేదు, కలవలేదు. ఇతర పబ్బుల్లో కూడా ఇలాగే గొడవ చేసినట్టు, ఈ ఘటన తరువాత నాకు తెలిసింది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటె నా మీద చేయి కూడా వేసేవాళ్ళు కాదు. అతను రోహిత్ రెడ్డి అని తెలిసింది. ఎమ్మెల్యే తమ్ముడట.

ఘటన జరిగిన వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు

రాహుల్‌ సిప్లిగంజ్‌: నేను ఘటన జరిగిన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళా, ట్రీట్మెంట్ చేసుకొని మల్లి పబ్ వద్దకు వెళ్ళా, వారెవరో తెలుసుకోవాలని నాకు చాలా ఉండే. సీసీ టీవీ ఫుటేజ్ దొరుకుతుందా లేదా, ఏమైనా మిస్ యూస్ చేస్తారా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ తో ప్రభావం చుపిస్తారేమో అని వెళ్లాల్సి వచ్చింది.

మీ బాడీ లాంగ్వేజ్, మాటతీరు వల్ల దాడి జరిగింది అనుకుంటున్నావా ?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అక్కడ అంత జరిగి బీరు సీసాలతో కొట్టాక కూడా వాళ్లకు మర్యాద ఇచ్చి మాట్లాడితే ఎలా? అన్నా, ఇంత మంది అభిమానంతో నిజాయితీగా ఆడిన నన్ను బిగ్ బాస్ విజేతను చేశారు. ఇప్పడు గాళ్ళ గురించి మాట్లాడి ఫేమస్ చేస్తున్న.

వారి నుండి ఏమైనా ప్రమాదం ఉందని అనుకుంటున్నారా ?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అనుకోవట్లేదు. వాళ్ళు నన్నేమి చేస్తారన్న.

ఈ దాడి వల్ల మీ కెరీర్ కు ఏమైనా నష్టం కలుగుతుంది అనుకుంటున్నావా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: అలా ఎం జరగదన్న. ఇదే విషయాన్ని రోజు ఎందుకు మాట్లాడుకుంటారు. కొన్ని రోజులైతే మర్చిపోతారు. దాడి చేసినోడు మాత్రం పలానా రాహుల్ మీద దాడి బీరు సీసాతో దాడి చేసిన అని చెప్పుకుంటాడు. చెప్పుకోవడానికి రుబాబు తనం దొరికింది.

ఈ కేసులో పొలిటికల్ ఎంట్రన్స్ ఏమైనా ఉంటదని భావిస్తున్నావా ?

రాహుల్‌ సిప్లిగంజ్‌: 100% ఉంటదన్న. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండే కదా, రాజకీయంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కాకుంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంది.

రాజకీయ ఒత్తిడి వస్తే కేసు విత్ డ్రా చేసుకుంటావా ?

రాహుల్‌ సిప్లిగంజ్‌: నేను ఎట్టి పరిస్థితుల్లో కేసు విత్ డ్రా చేసుకోను. జస్టిస్ జరగాలి కదన్న. అమ్మాయిలను కామెంట్లు ఇలా చేస్తే, వీళ్ళను చూసి ఇంకో పదిమంది తయారవుతారు.

ముందు ఎవరు కొట్టారు ?

రాహుల్‌ సిప్లిగంజ్‌: రితేష్ రెడ్డి అనే అతనే కొట్టాడు.

ఇక మీదట పబ్ కు వెళ్లకూడదని అనుకుంటున్నావా?

రాహుల్‌ సిప్లిగంజ్‌: ఆడికి పోవద్దు అంటే నేను భయపడాలి సర్, సెలబ్రిటీ అయినా కొన్ని సెక్యూరిటీ ప్లేసులు ఉంటాయి. నమ్మి వెళ్తాము. రేపు గుడికి వెళ్తే అక్కడ కూడా దాడి చేస్తారని భయపడతామా? స్వేచ్చగా బతకాల్సిన దేశం ఇది. పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి.

చివరిగా ఏమి కోరుకుంటున్నావు

రాహుల్‌ సిప్లిగంజ్‌: సర్, జస్టిస్ జరగాలి సర్. ప్రభుత్వాన్ని అదే కోరుతున్న.

Rahul Sipligunj Reaction on PUB Attack