చిరంజీవి ట్వీట్ రాజమౌళి రిప్లై

ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RRR టీం ఉదయం 10గంటలకు తారక్ చేత అదిరిపోయే జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఉంటుందని తెలిపింది. అయితే చిరంజీవి వెయిటింగ్..! అని ఒక ట్వీట్ ను చేస్తూ తారక్, రామ్ చరణ్ లను ట్యాగ్ చేశాడు.

ఈ ట్వీట్ కు జక్కన్న రాజమౌళి రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై కాస్త ఫన్నీగా ఉంది. ‘సార్.. అంటే.. అది.. కొంచెం.. కొంచమే.. ఆక్చువల్ గా.. ప్లీజ్.. సర్..’ అని సాగదీస్తూ బదులిచ్చాడు. దానికి చిరు కూడా రిప్లై ఇచ్చారు.. ‘అర్ధమైంది జక్కన్న గారు..’ అని.

తారక్ ఇవ్వాల్సిన సర్ ప్రెస్ రాజమౌళికి రాత్రి పంపించినట్టు, ఈ విషయాన్ని ఎన్టీఆర్ తెలిపాడు.

అయితే ఈ వెయిటింగ్ సాయంత్రం 4 గంటల వరకు తప్పదు..

 

#BheemforRamaraju