సామజవరగమన పాట ఫిమేల్ వెర్షన్ – అదరగొట్టిన శ్రేయాఘోషల్‌

0
సామజవరగమన పాట ఫిమేల్ వెర్షన్
Pic Credit: YouTube/Aditya Music

‘సామజవరగమన’ పాటకు ఫిమేల్‌ వెర్షన్‌ వచ్చేసింది. సిద్‌ శ్రీరామ్‌ పాడిన మేల్ వెర్షన్ విడుదలై చాలా రోజులైనప్పటికీ ఇంకా ఆ పాటకు ఉన్న క్రేజ్‌ ఓ రేంజ్ లో ఉంది.

‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని ‘సామజవరగమన’ ఫిమేల్‌ వెర్షన్‌ను శనివారం సాయంత్రం (04/01/2020)
చిత్రబృందం విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఇది యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది.

బాలీవుడ్ ప్రముఖ సింగర్‌ శ్రేయాఘోషల్‌ ‘సామజవరగమన’ పాట ఫిమేల్‌ వెర్షన్‌ ఆలపించడంతో పాటకు మరింత క్రేజ్‌
పెరుగుతుంది అనడంలో ఏ సందేహం లేదు. ఫేమ్స్ – మాసిడోనియన్ సింఫోనిక్ ఆర్కెస్ట్రా, స్కోప్జే రికార్డింగ్ స్టూడియోలో పాటను రికార్డ్ చేశారు.

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

Dev P
I am Dev P, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here