తమిళంలో విజయం సాదించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘96’ కు రీమేక్ గా వస్తున్న శర్వానంద్‌ సమంత ల ‘జాను’ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు (29/01/2020) విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్‌ చూస్తుంటే హృదయాలను హత్తుకునేలా ఉంది.

“ఎగసి పడే కెరటాలను ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను… పిల్లగాలి కోసం ఎదురు చూసే నల్లమబ్బులా… ఓర చూపు
కోసం.. నీతో ఒక నవ్వు కోసం… రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం… నా వైపు ఓ చూపు అప్పు ఇవ్వలేవా..” అంటూ శర్వానంద్‌ తన ప్రియురాలు కోసం కవిత చెప్పడంతో ట్రైలర్‌ మొదలవుతుంది.

చిత్రం ఖచ్చితంగా యువతను ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పవచ్చు ట్రైలర్ ను చూసినవాళ్లు. ట్రైలర్‌ లో కనిపించే సన్నివేశాలు భావోద్వేగాలతో కూడుకున్నవిలా ఉన్నాయి.

ముఖ్యంగా డైలాగులు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా, ఏదో జరగబోతుంది అని మనసుకు ముందే తెలిసిపోతుంది’ అని సమంత చెప్పే డైలాగ్ మరియు ‘పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు  కూడా నువ్వు సొంతమే’ అని శర్వానంద్‌ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మాణసారథ్యంలో, సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘జాను’ చిత్రీకరణ
ఇప్పటికే పూర్తి చేసుకొని ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది.

ట్రైలర్ మీద మీరూ ఓ లుక్కేయండి.

Sharwanand Samantha Jaanu Trailer

ఇది చదవండి: ప్రాణం నా ప్రాణం పాట లిరిక్స్