Saranga Dariya Song Meaning – Suddala Ashok Teja Love Story Movie Song Writer

0
Saranga Dariya Song Meaning

Saranga Dariya Song Meaning. తెలంగాణ జానపదం అయిన ఈ పాటను గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారు కోమలి నుండి గ్రహించి రచించడం జరిగింది. ప్రజాదరణ పొందిన సారంగ దరియా పాట యొక్క అర్ధం ఇక్కడ చూద్దాం.

Saranga Dariya Song Meaning

దాని పేరే సారంగ దరియా: సారంగిణి ధరించినటువంటి అమ్మాయి.
వివరణ: ఉదాహరణకు మురళీధరుడు అనగా, మురళిని ధరించిన వాడు. అలాగే ఇక్కడ సారంగిణి ధరించినవాడు సారంగ ధరుడు, అమ్మాయిని ఉద్దేశించి రాసింది కాబట్టి దరి అని చెప్తారు. సారంగి అనేది ఒక వాయిద్యం. ముఖ్యంగా గిరిజన తెగలు చెందిన వారు ఎక్కువగా వాడే వాయిద్యం పేరే ఈ సారంగి.

దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా

వివరణ: నీటితో ఉన్న కుండను భుజం మీద మోసుకెళ్తుంటే, అందులో ఉన్న నీరు కాస్త జారి తన రైక (జాకెట్) మీద పడుతుంటే ఆ నీటి తడికి మెరుస్తుంది. గుత్తెపు రైక (హుక్స్ కానీ గుండీలు కానీ లేకుండా ముడి వేసుకున్న జాకెట్టు) అనగా బిగుతుగా ఉన్న జాకెట్. అది సారంగ దరియా, అల్లాటప్పా కాదు రమ్మనగానే రావడానికి.

కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్

వివరణ: కాళ్ళకు వెండీ పట్టీలు లేకున్నప్పటికీ, నడుస్తుంటే ఆ అమ్మాయి నడిచి వస్తుంటే గుండెలు ఘల్ ఘల్ అని అనక మానవు.
జడలో మల్లె పూలు లేకున్నా, చెక్కిలి గిలి పెట్టినంత ఆనందమవుతుంది. ఇక్కడ కవి ఉద్దేశ్యం, ఇవన్నీ లేకున్నా సగటు
గ్రామీణ మహిళ కూడా అప్సరసలతో సమానం అని చెప్పడం.

రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి

వివరణ: తెల్లటి అంగీ (చొక్కా – Shirt). ఆ అమ్మాయి వెంట్రుకలు ఎంతటి నల్లనివి అంటే, పొరపాటున ఆ జడ తెల్లటి చొక్కాకు తాకితే నల్లగా మారే అంత. నల్లంగి (నల్లటి చొక్కా). ఇక్కడ గ్రహించాల్సిన విషయం నల్లగా మారేది షర్ట్ మాత్రమే కాదు, నీ పురుష అహంకారం కూడా.

Check the full lyrics of Saranga Dariya

Singer Mangli
Music Pawan Ch
Lyrics Suddala Ashok Teja
Music Label

Suddala Ashok Teja Explain About Saranga Dariya

Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here