Sarvari Nama Telugu Rasi Phalalu
అందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరాదిలో అందరూ తెలుసుకోవాలని కోరుకునేది వారి వారి రాశి ఫలాలు. ఈ శార్వరి నామ సంవత్సరం 25 మార్చి 2020 నుండి 12 ఏప్రిల్ 2021 వరకు జరుగుతుంది.
Sarvari Nama Telugu Rasi Phalalu
అయితే ప్రతీ రాశి వారికి రాజపూజ్యం, అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకుంటారు ఈ ఉగాది రోజున. వాటితో పాటు కొన్ని పాటించే ముఖ్య జాగ్రత్తలు కూడా ఫాలో అవుతుంటారు. మరి ఏ రాశికి ఏలాంటి ఫలితం ఉందొ చూద్దాం.
మేష రాశి ఫలాలు (Mesha Rasi – Aries Horoscope) 2020 – 21
ఆదాయం – 05 |
వ్యయం – 05 |
రాజపూజ్యం – 03 |
అవమానం – 01 |
- మేష రాశి వారికి ఆదాయం మరియు వ్యయం సమానంగా ఉంది.
- ఆరోగ్య సమస్యలు అంతగా బాధించవు.
- చేస్తున్న పనులు శ్రద్ధతో చేసుకుంటూ పోవాలి.
- అనవసర ఆవేశాలు పనికిరావు.
- ఆర్ధిక లావాదేవీల విషయంలో ఆచి తూచి స్పందించాలి.
- మనస్ధాపానికి గురి చేసే అంశం ఏంటంటే, దాచిన విషయాలు బయటపడతాయి.
- కష్టాన్ని, దైవాన్ని నమ్ముకొని ముందుకుసాగుతారు.
- నా అనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి.
- కాస్త నెమ్మదిగా జరిగినా.. కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు.
వృషభ రాశి ఫలాలు (Vrushabha Rasi – Taurus Horoscope) 2020 – 21
ఆదాయం – 14 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 06 |
అవమానం – 01 |
- వృషభ రాశి వారికి ఆదాయంతో పాటు రాజపూజ్యం బాగుంది.
- వీరికి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అది కూడా వారికున్న ఆవేశం వల్లే.
- స్థిరాస్తి కొనుగోలు ఉంటుంది.
- ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి.
- వ్యాపారస్థులకు గురువు అనుగ్రహం ఉండడం వల్ల వ్యాపారం బాగా ఉంటుంది.
- కళాకారులకు ప్రతిభకు తగ్గ ఫలితం ఉంటుంది.
- ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు నిర్వహిస్తారు.
మిథున రాశి ఫలాలు (Mithuna Rasi – Gemini Horoscope) 2020 – 21
ఆదాయం – 02 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 02 |
అవమానం – 04 |
- మిథున రాశి వారికి కొంత ప్రతికూల ఫలాలు ఉన్నప్పటికీ ఆదాయ తేడాల వల్ల అప్పులపాలు అవుతారని కాదు.
- వీరు చేసే పనులు నలుగురికి ఉపయోగకరంగా ఉంటాయి.
- వ్యయం ఎక్కువగా ఉండనే కంగారు అవసరం లేదు. నూతన గృహం, వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది.
- విమర్శలను పట్టించుకోవాల్సిన పని లేదు.
- కుటుంబ సభ్యులతో చనువుగా మెలగడం మంచి ఫలితాలు మీకే లాభిస్తుంది.
- ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్పనిసరి.
- ఎంత క్లిష్టమైన పని అయినప్పటికీ పూర్తి చేసే సత్తా వారి సొంతం.
కర్కాటక రాశి ఫలాలు (Karkataka Rasi – Cancer Horoscope) 2020 – 21
ఆదాయం – 11 |
వ్యయం – 08 |
రాజపూజ్యం – 04 |
అవమానం – 05 |
- ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది.
- కుటుంబ వ్యవహారాల్లో ఈ రాశి వారిదే పెత్తనం.
- కుటుంబంలో ఈ రాశి వారి మీద కొంత అసూయ, గిట్టని తనం ఉన్నా పట్టించుకోవాల్సిన పని లేదు.
- భార్యా భర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది.
- సంతాన అభివృద్ధి ఉంటుంది.
- ఉద్యోగస్థులకు కలిసొచ్చే సంవత్సరం ఇది. అనుకున్న చోటుకి బదిలీ అయ్యే అవకాశం, పై అధికారుల మెప్పు ఉంటుంది.
- అనుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- వ్యాపారస్థులకు ఇది వారికంటే ఈ సంవత్సరం బాగుంటుంది.
- విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు.
- రైతులకు రెండు పంటల ద్వారా లాభం చేకూరుతుంది.
సింహ రాశి ఫలాలు (Simha Rasi – Leo Horoscope) 2020 – 21
ఆదాయం – 14 |
వ్యయం – 02 |
రాజపూజ్యం – 01 |
అవమానం – 07 |
- ఈ రాశి వారికి తెలియకుండానే అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
- అభివృద్ధిని చూడలేక కొంత మంది అవమాన పరచడానికి ప్రయత్నిస్తుంటారు.
- చేసే మంచి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఉండే వారితో జాగ్రత్తగా ఉండడం మంచింది.
- సంవత్సరమంతా అత్యంత యోగదాయకంగా, ఆనందకరంగా ఉంటుంది.
- అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
- ధన ధాన్య వృద్ధి ఉంటుంది. సంతానప్రాప్తి ఉంటుంది.
- గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి.
- వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కలిసొస్తుంది.
- వ్యాపారం చక్కగా సాగుతుంది.
- విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు.
- కళాకారులకు అనుకున్నవి సాధిస్తారు.
- స్త్రీలు వృద్ధి చెందడానికి మంచి అవకాశాలు లభిస్తాయి.
- ఇంతకాలం చేసిన పనులకు ప్రతిఫలం దక్కుతుంది.
కన్య రాశి ఫలాలు (Kanya Rasi – Virgo Horoscope) 2020 – 21
ఆదాయం – 02 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 04 |
అవమానం – 07 |
- రెండు ఆదాయం పదకొండు వ్యయం అనుకొని కృంగుపాటు అవసరం లేదు. ఏదో ప్రకారంగా వృద్ధి కనిపిస్తుంది.
- భగవంతుని అనుగ్రహం మీయందు ఉంటుంది.
- అత్యంత శుభదాయక విషయం ఏంటంటే.. 3 సంవత్సరాల అర్ధాష్టమ శని దోషం తొలిగిపోతుంది.
- ఎప్పటినుండో ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
- సంతాన రీత్యా ఆనందం కలుగుతుంది.
- రాహు-కేతువులు సువర్ణ మూర్తులుగా సంచరించడం వల్ల, అన్నీ శుభదాయకమే.
- ఆదాయం ఎక్కువగా ఉంటేనే శుభదాయకం అనుకోకూడదు.
- గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది.
తుల రాశి ఫలాలు (Tula Rasi – Libra Horoscope) 2020 – 21
ఆదాయం – 14 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 07 |
అవమానం – 07 |
- తుల రాశి వారికి ముఖ్యంగా మిత్రుల నుండి ఇబ్బందుకు ఎదురవుతాయి.
- దైవ కృప ఉండడంతో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.
- ఉద్యోగులకు బదిలీలు, గృహమార్పులు ఉంటాయి.
- భార్య భర్తల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. సమన్వయంతో ముందుకు సాగడం ముఖ్యం.
- ఒడిదుడుకులు లేకుండా సంసారం సాఫీగా సాగుతుంది.
- వ్యాపారస్థులకు స్వల్ప లాభాలు ఉంటాయి.
- విద్యార్థులకు గురు బలం బాగా ఉండడంతో ముందుకు సాగుతారు.
వృశ్చిక రాశి ఫలాలు (Vruchika Rasi – Scorpio Horoscope) 2020 – 21
ఆదాయం – 05 |
వ్యయం – 05 |
రాజపూజ్యం – 03 |
అవమానం – 03 |
- వృశ్చిక రాశి వారు ఆభరణాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
- ధనాదాయం బాగుంటుంది.
- ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉండవు.
- వ్యవసాయదారులకు మంచి దిగుబడి ఉంటుంది. చేపలు, రొయ్యల వ్యాపారం కలిసి వస్తుంది.
- స్త్రీలకు కలిసొచ్చే సంవత్సరం ఇది. అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువ.
- ఆస్తుల కొనుగోలు, వాహనాలు కొనుగోలు ఉంటుంది.
- వివాహాలు జరిగే అవకాశం, సంతాన ప్రాప్తి ఉంటుంది.
- నూతన వ్యాపారంలో అడుగుబెట్టే సూచనలు ఎక్కువ.
- విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు.
- క్రీడాకారులకు బాగా దోహదపడే సంవత్సరం ఉంది.
- కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. మంచి పేరు సంపాదిస్తారు.
ధనస్సు (ధనూ) రాశి ఫలాలు (Dhanassu Rasi – Sagittarius Horoscope) 2020 – 21
ఆదాయం – 08 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 06 |
అవమానం – 03 |
- మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.
- బంధువులతో సంబంధాలు పునరుద్ధరింపబడుతాయి.
- పుణ్యక్షేత్ర సంచారం ఉంటుంది.
- ఉద్యోగులకు ప్రొమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి.
- స్థిరాస్తి పెంపొందించుకునే అవకాశాలు ఫలిస్తాయి.
- అన్ని రంగముల వ్యాపారులకు కలిసి వస్తుంది. మొదట్లో కొంత సానుకూలత ఉండొచ్చు.
- విద్యార్థులు వేరే వ్యాపకాల మీద దృష్టి మళ్లించే అవకాశాలు ఉంటాయి.
మకర రాశి ఫలాలు (Makara Rasi – Capricorn Horoscope) 2020 – 21
ఆదాయం – 11 |
వ్యయం – 05 |
రాజపూజ్యం – 02 |
అవమానం – 06 |
- ఉన్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.
- ఏలినాటి శని 2 1/2 నుండి 3 సంవత్సరాలు ఉంటుంది.
- అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కార్య సిద్ది, ధన లాభం ఉంటుంది.
- విమర్శించే వారు ఎక్కువ ఉంటారు కాబట్టి సంయమనంతో ఉంటె మంచిది.
- ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ చూపడం అనివార్యం.
- సంతాన ప్రయోజనాలు బాగుంటాయి.
కుంభ రాశి ఫలాలు (Kumbha Rasi – Aquarius Horoscope) 2020 – 21
ఆదాయం – 08 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 05 |
అవమానం – 06 |
- గృహావసరాల కోసం డబ్బు వెంటనే సర్దుబాటు అవుతుంది.
- చేస్తున్న నూతన వ్యాపారాలు విజయాల బాట అందుకుంటాయి.
- ఈ రాశి వారికి శని భాదలు ఉండవు.
- చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉన్నందున, ఆలోచించి అడుగులు వేయాలి.
- డబ్బుల విషయంలో జాగ్రత్తగా లావాదేవీలు జరుపుకోవాలి.
- పరోక్షంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది.
మీన రాశి ఫలాలు (Meena Rasi – Pisces Horoscope) 2020 – 21
ఆదాయం – 08 |
వ్యయం – 11 |
రాజపూజ్యం – 01 |
అవమానం – 02 |
- సంతాన ప్రాప్తికి చేసే నూతన ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి.
- చేసే మంచిపనులకు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
- జరుగుతాయి అనుకునే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి.
- తీసుకునే నిర్ణయాలు అయోమయంలో పడవేస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నిర్ణయించుకోలేరు. కావున సమయస్ఫూర్తితో వ్యవహరించాలి.
- ఆభరణాల కొనుగోలు చేస్తారు.
- ఇష్ట దైవాన్ని నిత్యం ప్రార్థించుకోవాలి.
Also Read: శార్వరి నామ సంవత్సరం అంటే ఏమిటి?