Home » సినిమా » చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం – శిఖరాగ్రానికి ఎదిగిన విజేత, మహోన్నత శక్తి, పద్మభూషణుడు

చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం – శిఖరాగ్రానికి ఎదిగిన విజేత, మహోన్నత శక్తి, పద్మభూషణుడు

చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం – శిఖరాగ్రానికి ఎదిగిన విజేత, మహోన్నత శక్తి, పద్మభూషణుడు: నాలుగు దశాబ్దాలుగా తెలుగు వారి గుండెల్లో నిలిచిన మహోన్నత శక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, గుండెనిబ్బరం, అంకితభావంతో పని చేస్తే సాధించలేనిది లేదని చెప్పడానికి చిరంజీవి గారు పెద్ద ఉదాహరణ. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే వారికి చిరంజీవి ఒక ఆదర్శం. దొరికిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టి తన జీవితానికి పునాదిరాళ్ళు వేసుకున్న గొప్ప వ్యక్తి చిరంజీవి. 65వ సంవత్సరంలో అడుగిడుతున్న మెగాస్టార్ గురించి ప్రత్యేక కథనం.

చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం

నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర

కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య దేవుడు

డాన్స్ అంటే అతను, అతనంటే డాన్స్

మాస్ కే మాస్ హీరో 

ఆఫ్ స్క్రీన్ లో అతనొక శాంతమూర్తి – విమర్శలకు కృంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి చిత్రపరిశ్రమలో అతనొక మెగాస్టార్

మెలోడ్రామాతో సాగిన మన తెలుగు సినీరంగానికి అతని ఎంట్రీతో నూతన ఒరవడి

1955, ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980వ సంవత్సరంలో వివాహం జరిగింది. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రాంచరణ్. ఇద్దరు సోదరులు నాగ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

మెగాస్టార్ సినీ ప్రాస్థానం – చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 11, 1978 లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మెదలుపెట్టిన మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. ఈ చిత్రంతో సెప్టెంబర్ 22, 1978న తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రాణం ఖరీదు చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి అందరినీ మెప్పించడమే కాకుండా అతని కళ్ళు ఆకర్షించాయి. 1979 లో విడుదలైన కోతలరాయుడు సినిమాతో టైటిల్ రోల్ పోషించిన చిరంజీవి ఇక వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు. నటుడిగా ప్రాస్థానం మొదలుపెట్టిన ఏడాదికే 14 సినిమాలు విడుదలయ్యాయి.

కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” చిత్రంతో తొలి సిల్వర్ జూబ్లీ అందుకున్నారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలతో ఒక కొత్త ఒరవడి మొదలైంది. నటనలో చురుకుదనం, డాన్సులు, ఫైట్లు అందరినీ ఆకట్టుకునేల చేశాయి. ఖైదీ చిత్రంతో చిత్రం చిరంజీవిని పెద్ద స్టార్ ను చేసింది.

1987లో అల్లు అరవింద్ నిర్మించిన పసివాడిప్రాణం చిత్రంతో టాలీవుడ్ నెం.1 స్థానం దక్కించుకున్నాడు చిరంజీవి. కొత్త ఒరవడికి నాంది పలికిన ఆ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. బాడీలో స్ప్రింగులు పెట్టుకున్నాడ అనేలా చేసిన డాన్సులు కుర్రకారుని ఉర్రూతలూగించాయి. తెలుగు సినిమాకు బ్రేక్ డాన్సులను పరిచయం చేసింది చిరంజీవి గారే అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. మాస్ హీరోగా ముద్ర వేసుకున్న చిరంజీవి ఆ తరువాత కొన్ని భిన్నమైన చిత్రాలు చేయడం అవి అంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ తన పంథా మార్చుకొని మాస్ చిత్రాల బాట పట్టాడు.

సుప్రీమ్ హీరో కాదు మెగాస్టార్

వరుస విజయాలతో మళ్ళీ గాడిలో పడ్డ చిరంజీవి ఆ క్రమంలో ఖైదీ నెం.786, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రాలతో భారీ విజయాలు అందుకున్నాడు. అప్పటివరకు సుప్రిమ్ హీరోగా ఉన్న చిరంజీవి మరణమృదంగం సినిమాతో మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు.

చిన్న చిన్న పాత్రలు, విలన్ వేషాలతో కెరీర్ మొదలుపెట్టిన చిరంజీవి అగ్రస్థానానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. హీరోగా వేషాలు మొదలు పెట్టిన చిరు తెలుగు సినిమా నెం.1 అవడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ అంతా తానే అయ్యారు చిరంజీవి. నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఆరేడు సంవత్సరాలకే దేశంలో పేరున్న గొప్ప నటుల్లో చిరంజీవి గారు ఒకరు. దక్షిణ భారతదేశం నుండి 1987 అకాడమీ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందుకున్న మొదటి నటుడు చిరంజీవి.

పారితోషికంలో రారాజు

90వ దశకంలో చిరంజీవి ఒక ప్రభంజనం. వెయ్యి నూట పదహారు రూపాయలు (Rs.1,116/-) మొదటిసారి పారితోషికం అందుకున్న చిరు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడుగా చరిత్ర సృష్టించాడు. “Bigger than Bachchan”, “The new money machine” శీర్షికలతో ఒక ఆంగ్లం మాగజైనులో  సెప్టెంబర్ 12, 1992 సంవత్సంరంలో ప్రచురితమవడంతో చిరంజీవి చరిష్మ దేశానికి తెలిసింది. అప్పట్లో మెగాస్టార్ అందుకున్న పారితోషికం రూ.1.25 కోట్లు. అమితాబ్ బచ్చన్ గారికి కూడా అంత పారితోషికం లేదు.

మెగాస్టార్ ను హిమోన్నత శిఖరాలకు చేర్చింది 90వ దశకం. చిరు కెరీర్ గురించి మాట్లాడుకుంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ప్రస్థావన రాకుండా ఉండదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ దృశ్య కావ్యం నిజంగా ఒక అద్భుతం. ఈ చిత్రం విడుదల సమయంలో ఆంధ్రదేశం అంత వర్ష భీభత్సం. అయినప్పటికీ కాసుల వర్షం కురిపించింది. ఇదే 90వ దశకం చిరంజీవికి చేదు అనుభూతిని కూడా మిగిల్చింది. వరసగా ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక కెరీర్ ముగిసిందా అనుకున్నారు చాలా మంది. అనుకున్నట్టే 1996 లో ఒక్క చిత్రం చేయలేదు. సంవత్సంరం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు మెగాస్టార్.

మలయాళంలో విజయవంతమైన హిట్లర్ రీమేక్ తో మళ్ళీ గాడిలో పడ్డ చిరంజీవి వరస విజయాలు అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన కొన్ని చిత్రాలు అడపాదడపా ఆడినా చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. అదే సమయంలో తనలో ఏ మాత్రం శక్తి తగ్గలేదని నిరూపించిన చిత్రం ‘ఇంద్ర’. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు కొడుతూ విజయ దుందుభి మోగించింది. ఇంకా తనే నెం.1 హీరో అని సత్తా చాటిన బ్లాక్ బస్టర్ ఇంద్ర. ఈ సినిమాలో చిరంజీవి గారు వేసిన వీణ స్టెప్పు ఇప్పటికీ చాలా పాపులర్. ఠాకూర్ తన తదుపరి చిత్రం. ఈ చిత్రంతో మెగాస్టార్ స్థాయి మరింత పెరిగింది. అతి భారీ విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం ద్వారా రాజకీయాలకు బాటలు పడ్డాయని చెప్పొచ్చు.

చిరంజీవి శఖంలో ఒక చాప్టర్ ముగిసింది 2008వ సంవత్సరంలో. సినిమాలు పక్కన పెట్టి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళారు. రాజకీయాలు చిరంజీవికి అంతగా కలిసి రాలేదు.

2009వ సంవత్సంరంలో మగదీర చిత్రంలో అథితి పాత్రలో నటించిన చిరు ఆ తరవాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. బ్రూస్లీ చిత్రంలో మరోసారి అథితి పాత్రలో దర్శనమిచ్చిన మెగాస్టార్ తొమ్మిదేళ్ళ సుదీర్ఘ సమయం అనంతరం ఖైదీ నెం.150 (2017 జనవరి 11) చిత్రంతో తనలో చావా తగ్గలేదని రీ-ఎంట్రీ ఇచ్చారు. 2017లో  “మీలో ఎవరు కోటీశ్వరుడు” ద్వారా బుల్లితెరకు కూడా పరిచయం అయ్యారు చిరంజీవి.

ప్రతిష్టాత్మకమైన సైరా నరసింహా రెడ్డి చిత్రంతో బిజీగా ఉన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. కేవలం 24 గంటల్లో 1.20 కోట్ల డిజిటల్‌ వ్యూస్‌ను దక్కించుకున్న ఈ టీజర్ రికార్డు సృష్టించింది.

ప్రత్యేకతలు

తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా సుపరిచితుడు. ‘తీఫ్ ఆఫ్ బాగ్దాద్’ చిత్రంతో హాలీవుడ్ లో కూడా సినిమా తీశారు.

అకాడమీ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందుకున్న మొదటి దక్షిణ భారతీయ నటుడు.

 అక్టోబర్ 2, 1998లో ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించి ప్రజాసేవ చేస్తున్నారు.

‘చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బాంక్’ లు ఈ ట్రస్ట్ ద్వారానే నడుస్తున్నాయి.

మొట్టమొదటిసారిగా ఒక హీరోకు బ్యానర్ కట్టింది చిరంజీవి గారికి.

భారతీయ నటుల్లో తనకంటూ ఒక వెబ్సైటును ఏర్పాటు చేసుకున్న మొదటి నటుడు చిరంజీవి.

చిరంజీవి అందుకున్న అవార్డుల వివరాలు

నంది అవార్డులు

  1. 1987 – కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన స్వయంకృషి చిత్రం ద్వారా మొదటిసారిగా ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నాడు.
  2. 1992 –  ఆపద్భాందవుడు చిత్రానికి ఉత్తమ నటుడు
  3. 2002 – ఇంద్ర చిత్రానికి మూడోసారి ఉత్తమ నటుడు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు – సౌత్ 

సంవత్సంరంసినిమా పేరు విభాగం
1982శుభలేఖఉత్తమ నటుడు
1985విజేతఉత్తమ నటుడు
1992ఆపద్భాందవుడుఉత్తమ నటుడు
1993ముఠామేస్త్రిఉత్తమ నటుడు
1999స్నేహం కోసంఉత్తమ నటుడు
2002ఇంద్రఉత్తమ నటుడు
2004శంకర్ దాదా ఎంబీబీఎస్ఉత్తమ నటుడు

ఇతర అవార్డులు

సంవత్సంరంఅవార్డు పేరు 
1988సినిమా ఎక్స్ ప్రెస్ అవార్డు
2006ప్రత్యేక అవార్డు – సౌత్
2006ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
2010లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు – సౌత్
2014సైమా – ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా
2016రఘుపతి వెంకయ్య అవార్డు

చిరంజీవి గారి జీవిత, సినీ విశేషాలు మీకు తెలిసినవి కామెంట్ రూపంలో షేర్ చేయగలరు.

 

Scroll to Top