Home » సినిమా » Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show – మీలో ఎవరికి బోర్ కొడుతుంది

Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show – మీలో ఎవరికి బోర్ కొడుతుంది

by Devender

Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా తమదైన శైలిలో వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

ఇప్పటికే తెలుగు యాంకర్లు కూడా ఇదే పనిలో ఏదో ఒక రకంగా అభిమానులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. యాంకర్  సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మిగతా యాంకర్లతో షో చేస్తుండగా శ్రీముఖి, ముక్కు అవినాష్ తో కలిసి స్పూఫ్ వీడియోలు చేస్తుంది.

మొన్న ‘బతుకు బలైపోయిన బండి’ చేయగా నేడు  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను స్పూఫ్ గా ‘మీలో ఎవరికి బోర్ కొడుతుంది’ అంటూ 15 నిమిషాల నిడివితో అవినాష్ నాగార్జునను అనుకరిస్తూ షో చేసిన వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో కెఏ పాల్, విజయ దేవరకొండ వాయిస్ ఓవర్ లను కుడా వాడుకొని జనాలను నవ్వించే ప్రయత్నం చేశారు.

ఇక ఇందులో అడిగిన పిచ్చ ప్రశ్నలు ఏంటో తెలియాలంటే మీరే వీడియో చూస్తే బెటర్.

Sreemukhi Meelo Evarki Bore Kodthundi Comedy Show Video

Also Read: Bathuku Balaipoyina Bandi Show

You may also like

Leave a Comment