Ghallu Ghallu Song Lyrics in Telugu penned by Sirivennela Seetharama Sastry Garu, music composed by Ilayaraja Garu, and sung by S P Balasubramanyam & Susheela Garlu from the Telugu film ‘Swarna Kamalam‘.
Ghallu Ghallu Song Credits
Movie | స్వర్ణ కమలం (15 July 1988) |
Director | K Vishwanath |
Producer | Ch V Appa Rao |
Singer | S P Balasubramanyam, Susheela |
Music | Ilayaraja |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Venkatesh, Bhanupriya, Sharon Lowen |
Music Label |
Watch ఘల్లు ఘల్లు ఘల్లుమంటు Video Song
Ghallu Ghallu Song Lyrics In Telugu
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు
పల్లవించని నేలకు
పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే యెరగని వేగంతో వెళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్ళు
లయకే నిలయమై
నీ పాదం సాగాలి, ఆహహ హహా
మలయానిలగతిలో
సుమబాలగా తూగాలి, ఆ ఆహ ఆ ఆహ
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ..?
తిరిగే కాలానికీ… ఆ ఆఆ ఆఆఆ
తిరిగే కాలానికి తీరొకటుందీ
అది నీ పాఠానికి దొరకను అందీ
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు
విలువేముందీ?… విలువేముందీ?
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్ళు
దూకే అలలకూ
ఏ తాళం వేస్తారూ, ఆహా హా ఆ హా
కమ్మని కలల పాట
ఏ రాగం అంటారు, మ్మ్ మ్మ్ మ్మ్
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్థం?
వద్దని ఆపలేరు… ఆఆ ఆ ఆ ఆఆ
వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ
హద్దులు దాటరాదు ఆశల వాహినీ
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల
విలువేముందీ?… విలువేముందీ?
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు చల్లనీ
చల్లని చిరు జల్లు
వెల్లువొచ్చి సాగనీ
తొలకరి అల్లర్లు
పల్లవించనీ నేలకు
పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు
మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున
ఉప్పొంగు నింగి ఒళ్ళు