దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక ఈరోజు జరిగింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయిన
కే ఎల్ రాహుల్ ను జట్టు నుండి తప్పించారు సెలెక్టర్లు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లో అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు.
దక్షిణాఫ్రికా ‘ఎ’ తో జరిగిన అన్ని ఫార్మాట్లలో రాణించిన శుబ్‌మన్ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.
టెస్టుల్లో నెం.1 ర్యాంకులో ఉన్న భారత్ జట్టులో ఈ ఒక్క మార్పు తప్ప ఎలాంటి సంచలనాలు లేకుండా జట్టు ఎంపిక జరిగింది. 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎంపిక కమిటీ గురువారం వెల్లడించింది.
భారత జట్టు…..
విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, అజింక్యా రహానే, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుబ్‌మన్ గిల్.