Team Mask Force New Task – ‘టీం మాస్క్ ఫోర్స్’ ప్రధాని మోదీ సూచన

Team Mask Force New Task. బయటికి వెళ్తున్నప్పుడు తప్పకుండ ముసుగులు ధరించాల్సిన సమయం ఇది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

బీసీసీఐ మాస్కుల గురించి అవగాహన కల్పించడానికి ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ అనే టాస్కును రూపొందించారు.  భారత్ కొంతమంది క్రికెట్ దిగ్గజాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేసింది బీసీసీఐ శనివారం.

ఈ వీడియో ఉద్దేశ్యం ‘బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రోత్సహించడానికి అలాగే కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడటం.’ ద్రావిడ్, కోహ్లీ, రోహిత్, హర్భజన్, గంగూలీ, స్మృతి మందాన, హర్మన్ ప్రీత్, సెహ్వాగ్, మిథాలీ రాజ్, మరియు సచిన్ లు తమ మాస్కులను తామే తయారు చేసుకొని ధరించారు.

Team Mask Force New Task – ‘టీం మాస్క్ ఫోర్స్’

అయితే ఈ మాస్కులు తమ ట్రేడ్ మార్కులకు తగ్గట్టు క్రికెటర్లు తయారు చేసుకున్నారు.. అవేంటో క్రింద చూడండి.

  • సచిన్ – 10 నెంబర్ ఉన్న మాస్క్
  • ద్రావిడ్ – గోడలా ఉన్న మాస్క్
  • గంగూలీ – దాదా పేరుతో మాస్కు
  • సెహ్వాగ్ – మైక్ ఉన్న మాస్కు
  • భజ్జి – తలపాగా మాస్క్
  • రోహిత్ – బంతి సిక్సుకు దూసుకు పోతున్న మాస్కు
  • స్మృతి – బ్యాట్ ఉన్న మాస్క్
  • కోహ్లీ – వి మరియు ఏ కలిసి ఉన్నట్టు ఉన్న మాస్క్
  • మిథాలీ – రికార్డు పుస్తకం ఉన్న మాస్కు
  • హర్మన్ – బ్యాట్ కు రెక్కలు ఉన్న మాస్క్

ఈ విషయమై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా ‘#TeamMaskForce లో భాగం అవ్వండి. చిన్నదే, కాని అవసరమైన జాగ్రత్తలు మనందరినీ సురక్షితంగా ఉంచగలవు. దాని గురించి అవగాహన కల్పించడం ముఖ్యం’ అని సందేశమిచ్చారు.

చివర్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, ‘కమాన్ ఇండియా!, మాస్కులు తయారు చేసి, మాస్క్ శక్తిలో భాగం అవ్వండి. ప్రతీ ఒక్కరు 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం మరియు సామాజిక దూరం పాటించడం గుర్తుంచుకోండి.’ అని చెప్పారు. మీరు మాస్కులు తాయారు చేసి ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి.

 

Also Read: Telangana COVID 19 Cases On 18th April 2020