Telangana Health Department Jobs 2020
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో వైద్య సిబ్బందిని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవలే సీఎం కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ తాత్కాలిక పద్దతిలో వైద్య సిబ్బందిని [Doctors, Nurses and Lab Technicians (including retired medical professionals)] నియమించుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారు విడుదల చేసిన ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా డాక్టర్లు, నర్సులు, మరియు ల్యాబ్ టెక్నీషియన్లు మొదలగు వారిని భర్తీ చేస్తారు. రిటైర్డ్ మెడికల్ సిబ్బంది కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 3, 2020 వరకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు health.telangana.gov.in ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ ఉద్యోగానికి ఎంత వేతనం ఇవ్వనుందో కూడా ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు. కరోనా విధులు నిర్వహించే సిబ్బందికి ఇతర అలవెన్సులు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం.
Telangana Health Department Jobs 2020 – Salary
- మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): రూ.1,00,000
- మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్): రూ.40,000
- మెడికల్ ఆఫీసర్ (ఆయుష్): రూ.35,000
- స్టాఫ్ నర్స్: రూ.23,000
- ల్యాబ్ టెక్నీషియన్: రూ.17,000
అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో తము వెల్లడించిన జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వబడును. ఒరిజినల్ డాక్యూమెంట్లు పరిశీలించిన అనంతరమే ఉద్యోగ నియామకం ఉంటుంది.
అధికారిక నోటిఫికేషన్ – ఇక్కడ చూడండి
ఇక్క అప్లై చేసుకోండి
చివరి తేది: 03.04.2020