తెలంగాణలో జరుగుతున్న టెన్త్ క్లాస్ (10వ తరగతి/ ఎస్సెస్సీ) పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా టీఎస్ 10వ తరగతి పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. రేపు (21 మార్చి 2020) జరిగే పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని తీర్పు వెలువడించింది.
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదా
మార్చి 23 నుండి 30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని, ఆ తరువాత నిర్వహించే పరీక్షలపై నిర్ణయాన్ని పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలని తమ తీర్పులో తెలిపింది హైకోర్టు.
నిన్నటి నుండే మొదలైన ఎస్సెస్సీ పరీక్షల మీద కరోనా ప్రభావం పడినట్లయింది. దీనికి సంబంధించి ఇప్పుడే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 29న పరీక్షల షెడ్యూల్ కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.