టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులను ఈరోజు గురువారం (12.03.2020) ప్రకటించింది. పార్టీ జనరల్ సెక్రెటరీ కే. కేశవరావును రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయగా రెండో అభ్యర్థిగా శాసనసభ మాజీ స్పీకర్ సీనియర్ నేత కే.ఆర్.సురేశ్ రెడ్డిని ఖరారు చేశారు.
ముందు నుండి పొంగులేటి, దామోదర్‌రావులతో పాటు మరికొందరి పేర్లు వినిపించినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సురేశ్ రెడ్డి మరియు కేశవరావులను ఖరారు చేశారు.
ప్రస్తుతంలో శాసనసభలో టీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న సంఖ్య బలంతో ఈ రెండు స్థానాలు పార్టీకి దక్కనున్నాయి. సురేశ్ రెడ్డి మరియు కేశవరావులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిద్దరూ శుక్రవారం నామినేషన్ ధాఖలు చేయనున్నారు.
Also Read: తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి