హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో శానంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం

శానంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీ తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం నమోదు చేశాడు. ప్రత్యర్థి,
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సతీమణి ఉత్తమ్‌ పద్మావతీ రెడ్డి ఏ మాత్రం పోటీ ఇవ్వడకుండా 43,284 ఓట్ల మెజార్టీతో ఓటమి చవిచూశారు.

మొత్తం 22 రౌండ్లపాటు జరిగిన ఓట్ల లెక్కింపులో సైదిరెడ్డి ప్రతీ రౌండ్ కు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. మొదటిసారిగా
హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జండాను ఎగురవేశారు. కాంగ్రెస్ కంచుకోటను మొత్తానికి కారు ఢీకొట్టింది.

అయితే ఇంత భారీ విజయాన్ని అందుకొన్న సైదిరెడ్డి కొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు హుజుర్‌నగర్‌ శాసనసభ 2009 ఎన్నికల్లో 29,194 ఓట్ల మెజార్టీతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గెలిచిన రికార్డును టీఆర్ఎస్ తిరగరాసింది. 15వ రౌండ్‌లోనే సైదిరెడ్డి ఈ రికార్డును అధిగమించారు. 15వ రౌండ్‌ ముగిసేసరికి శానంపూడి సైదిరెడ్డి 29,967 ఓట్ల మెజార్టీ సాదించారు.

ఇక పోటీ చేసిన టీడీపీ, బీజేపీ పార్టీలు తమ డిపాజిట్లు కూడా కోల్పోయాయి. మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సపావత్‌ సుమన్‌ నిలవడం గమనార్హం.