నేడే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ఏర్పాట్లకు కేసీఆర్ ఆదేశం

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేడు జరగనుంది. ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి కొత్త మంత్రులతో
ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.

తెలంగాణకు కొత్తగా నియామకమైన గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్‌ కు ఈ సమాచారాన్ని అందజేశారు.

గవర్నర్ గా తమిళ సై సౌందర్‌రాజన్‌ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈసారి మంత్రి వర్గంలో హరీశ్‌రావుతో పాటు కేటీఆర్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. వీరితో పాటు
సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఆరూరి రమేష్, సత్యవతి రాఠోడ్ తదితురలకు
మంత్రి పదవులు వరించవచ్చు.