TS Lockdown Till 15th April 2020
తెలంగాణాలో లాక్ డౌన్ 15 ఏప్రిల్ 2020 వరకు కొనసాగుతుందని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా లాక్ డౌన్ తప్పదని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
పోలీసులకు, ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ద కార్మికులకు ఆటంకం కలిగించకూడదని ఊరిలోకి రాకుండా నిర్బంధం విధించిన వారికి కెసిఆర్ తెలిపారు.
TS Lockdown Till 15th April 2020 – ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
- పండ్లు, కూరగాయలు, పశుదాణాకు లోటు లేకుండా అధికారులు చూసుకుంటున్నారు. మన దగ్గర పండ్లు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చూసుకోవాలి.
- తెలంగాణాలో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- అన్ని అనాథ ఆశ్రమాలు కొనసాగుతాయి.
- అందుబాటులోకి 12,400 పడకలు తీసుకొస్తున్నాము.
- 60 వేల మంది వ్యాధి గ్రస్థులను చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నాము.
- ప్రైవేట్ ల్యాబ్ వారికి మన దగ్గర అనుమతి ఇవ్వడం లేదు.
- మాంసాహారం తీసుకుంటే కరోనా రాదు. అపోహలకు పోకండి. గ్రుడ్లు, మాంసం తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.
- ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా తెలంగాణా ఆడుకుంటుంది.
- రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఆకలి బాధ లేకుండా చేసుకుంటాము.
- నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 10 వరకు సాగు నీటి సరఫరా కొనసాగుతుంది.
- ఏప్రిల్ 15 వరకు రైతులకు ఉచిత విధ్యుత్ అందుతుంది.
- విశ్రాంత డాక్టర్ల సేవలను వినియోగించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసాం.
- ప్రజలందరికీ మనవి — స్వీయ నియంత్రణ పాటించాలి.