తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌ ఎన్నిక

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ను రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి రానుందని అరుణ్ సింగ్ స్పష్టం చేసింది.

తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ కుమార్‌

ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ లక్ష్మణ్‌ నే మల్లి కొనసాగించే అవకాశాలే ఉన్నాయని అందరూ భావించినా అధిష్టానం మాత్రం కొత్త వ్యక్తికే పగ్గాలు అప్పగించింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సంజయ్ కుమార్ తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ పై గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టాడు.

బండి సంజయ్‌ కుమార్‌ క్రింది స్థాయి పదవులు మొదలుకొని అనేక పదవుల్లో కొనసాగారు. అద్వానీ నిర్వహించిన సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇంచార్జిగా కూడా పనిచేసిన సంజయ్ కరీంనగర్ ఏబీవీపీ కన్వీనర్ నుండి కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 48వ డివిజన్‌ నుంచి రెండు సార్లు కార్పొరేటర్ గా విజయం సాధించారు. 2014 ఎన్నికలో ఎమ్మెల్యే గా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.