10వ తరగతి పరీక్షలకు హాజరైన అవిభక్త కవలలు వీణా వాణిలు. హైదరాబాద్ మధురానగర్ లోని ప్రతిభ హైస్కూల్ లో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వచ్చారు వీణావాణీలు. జంబ్లింగ్ పద్దతిలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రత్యేక కేసు కావడంతో అధికారులు వీరికి మినహాయింపు ఇవ్వడంతో ఒకగదిలో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. వీరికి వేరు వేరుగా హాల్ టికెట్లు కేటాయించింది ఎస్ఎస్సి బోర్డు.
స్టేట్ హోమ్ కు సమీపంలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ప్రత్యేక వాహనంలో వీణావాణిలు వచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వీరు మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. అయితే వీరికి ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు సహాయకులుగా ఉండనున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పరీక్ష కేంద్రం వద్దే ఉండి ఏర్పాట్లు పరిశీలించారు. ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే.