విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదల – నలుగురు హీరోయిన్లతో రొమాన్స్

Song Lyrics
విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ చూస్తుంటే అర్జున్ రెడ్డిని మించేలా ఉంది. యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ ను చిత్ర బృందం కొద్ది సేపటి క్రితం (జనవరి 3, శుక్రవారం) విడుదల చేసింది.
‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్ గౌతమ్, ప్రేమంటే ఒక సాక్రిఫైజ్, ప్రేమలో దైవత్వం ఉంటుంది, అవేవీ నీకు అర్థం కావు’. అంటూ
హీరోయిన్ ఏడుస్తూ చెప్తున్న డైలాగ్ తో టీజర్ మొదలైంది. చివర్లో హీరో ఏడుస్తూ ఆవేశంగా చెప్పే డైలాగ్ వింటే అర్జున్ రెడ్డి సినిమా గుర్తుకురాక మానదు.
విజయ్ దేవరకొండ సరసన ఐశ్వర్యా రాజేష్, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా, రాశీఖన్నా రొమాన్స్ చేయనున్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
14 ఫిబ్రవరి 2020 న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
మీరూ ఓ లుక్కేయండి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్.

Leave a Reply