విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా స్నీక్ పీక్ పేరుతొ విడుదల చేసిన వీడియో ఉత్కంఠకు గురిచేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ‘HIT’ తెలుగు సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ నెల ఫిబ్రవరి 28న విడుదలకు సిద్ధమైంది.
నాచురల్ స్టార్ నాని సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డా.శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
హీరో విశ్వక్ అత్యంత చాకచక్యంగా ఎక్కడ పాటి పెట్టారో తెలియని ఒక మహిళా మృతదేహాన్ని కనిపెడుతున్న వీడియో ఆకట్టుకుంటుంది. విశ్వక్ సేన్ సరసన రుహాణి శర్మ నటిస్తుంది.