World Famous Lover Trailer Out! ఇంత బోల్డ్ ఏందిర నాయన–!
‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్ర్రైలర్ వచ్చేసింది. ‘ఈ ప్రపంచంలో నిస్వార్దమైనది ఎదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు, ఐ వాంటెడ్ టూ బి దిస్ వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.
‘నా గుండెకి తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలియకుండా ఉండాలంటే ఫిజికల్ గ ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలె, నౌ ఐ లిట్రల్లీ ఫీల్ ద
పెయిన్’ అంటూ దేవరకొండ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది’ ఇంకా ట్రైలర్ మధ్యలో వచ్చే డైలాగులు బానే ఉన్నా బోల్డుగా
ఉన్నాయి. ముఖ్యంగా ‘మీ ఆడోల్లకు అస్సలు…..’ డైలాగ్ మరియు ‘నీ యవ్వ తంతె కిటికీల పడ్తవ్ మరి’ ట్రైలర్ లో సందర్భంగా వచ్చే డైలాగ్ లు బోల్డె అనక తప్పదు.
‘ఎవరు ఏది ప్రేమిస్తారో అది వారికి దొరకాలి’, రాశీ ఖన్నా ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ ‘నేను అలసిపోయాను, మై మైండ్, మై హార్ట్, ఇట్స్ జస్ట్ బ్లీడింగ్’ బాగుంటుంది. ఐశ్వర్య రాజేష్ చెప్పే డైలాగ్ ‘జిందగీ ఎమన్నా కమ్మగా ఉందా మామ’ మరియు ‘ఇగో ముఖ్యమైన పని పడ్డది, మేడమ్ కు ఈ మైన్లు సూపించాల్నట, నేను పోతున్న’ విజయ్ చెప్పే డైలాగ్ పక్కా తెలంగాణ యాసలో ఉంటాయి.
ఐశ్వర్యా రాజేష్, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసా, రాశీఖన్నా లు విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల రోజు 14 ఫిబ్రవరి 2020 థియేటర్లలో సందడి చేయనుంది. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్ర్రైలర్ (World Famous Lover Trailer) Watch Below.
ఇది కూడా చదవండి: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్