Home » Dialogue Lyrics » Yamadonga Dialogue Lyrics In Telugu & English – Jr. NTR Movie Yamadonga

Yamadonga Dialogue Lyrics In Telugu & English – Jr. NTR Movie Yamadonga

Yamadonga Dialogue Lyrics. మోహన్ బాబు గారు మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య డైలాగ్ లిరిక్స్ ‘యమ దొంగ’ చిత్రంలోనిది.

యమ దొంగ Dialogue Details

MovieYamadonga (15 August 2007)
DirectorS S Rajamouli
ProducersUrmila Gangaraju and P. Chiranjeevi
MusicM M Keeravani
Star CastJr NTR, Priyamani, Mamta Mohandas, Mohan Babu, Khushboo
Video Source

Yamadonga Dialogue Lyrics In Telugu

మోహన్ బాబు: నీవు పగ సాధించవలెనని రప్పించిన మానవుడు మా పీఠమునకే ఎసరు పెట్టుటయా..! ఓరీ మానవ
జూనియర్ ఎన్టీఆర్: హుమ్
మోహన్ బాబు: మతి తప్పినదా, మధమెక్కినదా… ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు, దానిని అధిష్టించుటయా..! ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము… తుచ్చ మానవ.
డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు. చచ్చామురో దేవుడా అని నిత్యము మొత్తుకొనే మీరెక్కడా..!! మీ జనన మరణములు మునివేళ్ళతో నిర్ణయించు మేమెక్కడరా..!!!
మీ మానవజాతి అల్పమూ, స్వల్పమూ, హేయమూ… హే నీచ నీచము. అట్టి నీచ జాతిన జనియించిన నీవు నరకాధిపతి అవుటయా… అసంభవం. వృదా ప్రయత్నము మాని, యమ దండనకు సిద్ధము కమ్ము.
తలవంచి మొక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి…

జూనియర్ ఎన్టీఆర్: యమా…!!!
ఏమంటివి ఏమంటివి… మానవ జాతి నీచమా. ఎంత మాట, ఎంత మాట…
వైతరణి వరకు వెంటాడి వేదించి… ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట గలిపి
పతి ప్రాణములు దక్కిచ్చుకున్న నారీమణి సావిత్రిదేజాతి… మానవ జాతి

తన భక్తితో సాక్షాత్ పరమ శివుడినే ప్రత్యక్షము గావించి మీ పాషముని సైతం గడ్డి పోచగా నెంచి
ప్రానహరులైన మిమ్ములనే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు… మార్కండేయుడిదేజాతి… మానవ జాతి

నీచ నీచమన్న మా జాతి మూలమున… ఏనాడో అప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు
నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా…
ఎంత అవివేకం, ఎంత అఙ్ఞానం, ఎంత కుసంస్కారం…

నేటి నుంచి దేవుడధికుడు, నరుడధముడు అన్న కించ భావాన్ని…
కూకటి వేళ్ళతో సైతం పెకలించి వేసెదా…

మొక్కులు పొందే ముక్కోటి దేవతలు… దిక్కులను ఏలే అష్ఠ దిక్పాలకులు
మనుగడ నిచ్చే పంచభూతములు సైతం…
హె జయహో నరుడా… అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అదిష్ఠించెద

స్వర్ణ మణిమయ. రత్న కచతాళంకృతమైన… ఈ సభా మందిరమున
అకుంటిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున…
భూతల పరిరక్షణ ధర్మా నిలయమైన
ఆఆ… ఈ… రౌరవమున…

సర్వదా శతదా… శతదా సహస్రదా
పాప పంకిలమైన… కుల మత జాతి కూపమును
సమూలముగా శాస్వతముగా… ప్రక్షాళన గావించగా

ఎని డౌట్స్…

Watch Jr.NTR Emativi Emantivi Dialogue – Yamadonga Cinema


Yamadonga Dialogue Lyrics In English

Junior NTR: Yamaa..!!
Emantivi Emantivi… Maanava Jaathi Neechamaa.
Entha Maata Entha Maata…

Vaitharani Varaku Ventaadi Vedhinchi
Mupputhippalu Petti Mee Dharma Soothramulanu Manta Galipi
Pathi Praanamulu  Dhakkinchhukunna Naareemani Saavithri Devi-Dhejaathi… Maanava Jaathi.

Thana Bhakthitho Saakshaath Parama Shivudine
Prathyakshamu Gaavinchi… Mee Paashamuni Saitham
Gaddi Pochagaa Nenchi… Praanaharulaina Mimmulane
Praanabhayamtho Parugetthinchina Pasivaadu
Maarandeyudidhejaathi… Maanava Jaathi

Neecha Neechamanna Maa Jaathi Moolamuna…
Enaado Aprathishta Moota Kattukunna Meeru
Nedu Jaathi Jaathi Ani… Mammu Avahelana Cheyutayaa…
Entha Avivekam, Entha Agnaanam, Entha Kusamskaaram…

Neti Nunchi Devudadhikudu, Narudadhamudu… Anna Kincha Bhaavaanni
Kookati Vellatho Saitham Pekilinchi Vesedhaa…

Mokkulu Pondhe Mukkoti Devathalu… Dhikkulanu Ele Ashta Dikpaalakulu
Manugadanichhe Panchabhoothamulu Saitham…
Hey Jayaho Narudaa… Ani Harshinche Vidhamgaa
Ee Simhaasanaanni Adhishtinchedha.

Swarna Manimaya, Rathna Kachathaalamkruthamaina… Ee Sabhaa Mandhiramuna
Akuntitha Sevaadhaksha Parivaara Samooha Madhyamuna…
Bhoothala Parirakshana Dharma Nilayamaina
Aa Aa… Ee Rouravamuna…

Sarvadhaa Shathadhaa… Shathadhaa Sahasradhaa
Paapa Pankilamaina… Kula Matha Jaathi Koopamunu
Samoolamugaa Shaashwathamugaa… Prakshaalana Gaavinchagaa

Any Doubts……………

1 thought on “Yamadonga Dialogue Lyrics In Telugu & English – Jr. NTR Movie Yamadonga”

  1. Pingback: Dasakantha Dasagriva Dialogue Lyrics - Jr NTR 'Jai Lava Kusa' Movie Dial

Comments are closed.

Scroll to Top