ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ సెమీఫైనల్ దశకు చేరుకుంది. మొత్తం పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఇన్ని రోజులు గ్రూప్ మ్యాచ్ లు ఆడాయి. చివరి రెండు గ్రూపు మ్యాచ్ లు వర్షం వల్ల రద్దవడంతో పసికూన థాయిలాండ్ జట్టు పాకిస్థాన్ పై గెలిచే అవకాశం కోల్పోగా ఇంగ్లాండ్ గ్రూప్-బి లో మొదటి స్థానాన్ని దక్కే అవకాశం చేజారింది.
సెమీఫైనల్ ఎవరు ఎవరితో
అందరికంటే ముందుగా సెమీస్ కు చేరిన భారత మహిళా జట్టు గ్రూప్-ఏ లో మొదటి స్థానాన్ని దక్కించుకోగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. అలాగే గ్రూప్-బి నుండి దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లాండ్ మొదటి రెండు స్థానంలో నిలిచాయి.
సిడ్నీ వేదికగా గురువారం మార్చి 5న జరిగే మొదటి సెమిఫైనల్ లో భారత్ మహిళలు ఇంగ్లాండ్ మహిళా జట్టుతో, రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా తో తలబడుతుంది.
రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు సిడ్నీలో జరుగుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో కొంత ఆందోళనలో ఉన్నారు. మ్యాచ్ జరిగే రోజులో వర్షం పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.
సెమీఫైనల్ మ్యాచ్ లు జరగకుంటే ఎవరు ఫైనల్ చేరుతారు ?
ఒకవేళ రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయితే ఎవరు ఫైనల్ చేరుకుంటారో ఒక లెక్క ఉంది. గ్రూప్ లో ఎవరు టాప్ లో నిలిచారో ఆ రెండు జట్లే ఫైనల్ కు చేరుతాయి. నిరాశ కలిగించే విషయం ఏంటంటే రిజర్వు డే లేకపోవడం అభిమానులకు ఒకింత నిరుత్సాహం కలిగించే విషయం.
ఫైనల్ మ్యాచ్ వేదిక
ఫైనల్ మ్యాచ్ మాత్రం మెల్బోర్న్ లో ఆదివారం జరుగుతుంది. మెల్బోర్న్ లో వర్షం పడే అవకాశం లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ వర్షం పడిన ఫైనల్‌కు రిజర్వ్ డే ఉండడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
Read Also: ఐసిసి మహిళా టి20 ప్రపంచ కప్ క్రికెట్ పాయింట్ల పట్టిక 2020