మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ – కివీస్ కు షాక్ ఇచ్చి వరసగా మూడో విజయంతో సెమీస్ చేరిన భారత్

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ. ప్రపంచ కప్ క్రికెట్ లో భారత మహిళా జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆడిన
మూడు మ్యాచ్ ల్లో మూడు గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే. భారత్ తన చివరి
లీగ్ మ్యాచ్ ను శ్రీలంకతో ఈనెల 29న తలబడుతుంది. భారత్ మినహా ఏ జట్టూ సెమీస్ లో ఇంకా స్థానం ఖరారు చేసుకోలేదు.

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ – మరోసారి సత్తా చాటిన షఫాలీ వర్మ

ఈరోజు మెల్బోర్న్ వేదికగా న్యూజిలాండ్ తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ఇండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్మ్రితి మందన మరియు షఫాలీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ధాటిగా ఆడుతున్న మందన 11 పరుగులకే వెనుదిరినా 16 ఏళ్ళ షఫాలీ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసింది. 34 బంతుల్లో 3 సిక్సులు 4 ఫోర్లతో 46 పరుగులు చేసింది.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆడిన మూడు మ్యాచ్ లలో ఏ ఒక్క మ్యాచ్ లో కూడా 10 పరుగులు దాటలేదు. ఈరోజు మ్యాచ్ లో కూడా 5 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయింది. ఒక దశలో 92 పరుగులకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మంచి దశలో ఉన్న భారత్ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకొని 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ కు నిర్దేశించింది.

మహిళా టి20 ప్రపంచ కప్ Ind Vs NZ – బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరిసిన భారత్

మొదటి నుండి కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ కివీస్ ఆటగాళ్లను ఒత్తిడికి లోను చేశారు మన బౌలర్లు. ముఖ్యంగా వరుసగా 6
అర్ధసెంచరీలతో మంచి ఫామ్ లో ఉన్న డివైన్ ను త్వరగా అవుట్ చేయడం భారత్ కు విజయాన్ని చేరువ చేసింది అని చెప్పవచ్చు.

18వ ఓవర్ వరకు మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉన్నా 19వ ఓవర్లో 18 పరుగులు చేసిన అమీలియా కెర్ మ్యాచ్ ను ఒక్కసారిగా
కివీస్ వైపుకు తిప్పింది. అయితే చివరి ఓవర్లో 16 అవసరం ఉండగా మొదటి బంతి బౌండరీకి తరలడంతో భారత్ లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్న ఆ ఓవర్ ను శిఖా పాండే అద్భుతంగా వేయడంతో చివరికి భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత వరల్డ్ కప్ లోను భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.

స్కోర్లు: భారత్ 20 ఓవర్లలో 133/8 (షఫాలి వర్మ 46, తానియా భాటియా 23 – అమేలియా కెర్ 2/21, రోజ్మేరీ మెయిర్ 2/27)
న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 129/6 (అమేలియా కెర్ 34 * – శిఖా పాండే 1/21, రాజేశ్వరి 1/22) 4 పరుగుల ద్వారా

Also Read: బంగ్లాదేశ్ పై సునాయాస విజయంతో సెమీస్ కు చేరువలో భారత జట్టు