Home » తెలంగాణా » Jagga Reddy Fires on Revanth Reddy & His Followers – రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers – రేవంత్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్

by Devender

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers. తెలంగాణ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించాడు. రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు పేస్ బుక్ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య లేనిపోని ఆరోపణలు చేస్తూ నాతో పాటు మరికొందరు నేతలు తెరాస లోకి మారుతున్నట్టు పోస్టులు పెడుతున్నారు. ఇలా చేయడం తప్పు అని అన్నారు జగ్గా రెడ్డి.

Jagga Reddy Fires on Revanth Reddy & His Followers

కారు మేము ఎక్కాలంటే మమ్ముల్ని ఆపేటోడు ఎవరు. మేము పార్టీ కోసం పనిచేస్తుంటే ఇలా పోస్టులు పెట్టడమేంటి. రేవంత్ రెడ్డి అనుచరులు చేసే న్యూసెన్స్ అరికట్టాలి, కాంగ్రెస్ పార్టీ తక్షణమే కొర్ కమిటీ పెట్టాలి. అన్ని నియోజకవర్గ నాయకులు చాలా డిస్టర్బన్స్ లో ఉన్నారు నాతో కలిపి. 111 జీవో ఎత్తివేయడం వరకు సరే. కేటీర్ కు మీకేమైనా భూముల పంచాయితీ ఉంటె మీరు చూసుకోండి అంతేకాని పార్టీకి రుద్దడం ఏంటి?

మేము ఆరుగురం అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యల మీద మాట్లాడాలా లేక రేవంత్ రెడ్డి అనుచరులు పెట్టే వాటి మీద మాట్లాడాలా? పార్టీ కూడా దయచేసి కలుగజేసుకోవాలి.

రేవంత్ రెడ్డే తీస్మార్ ఖాన్ కాదు.. నేను విజిల్ వేస్తే 10 వేల మంది వస్తారు

ఇప్పుడున్న పరిస్థితుల్లో పేస్ బుక్ లలో పెట్టె పోస్టుల మీద నేను ఎట్టి సహించే ప్రశ్నే లేదు. ఇది మంచి పద్దతి కాదు. మీరు ఒక రేవంత్ రెడ్డే తీస్మార్ ఖాన్ అంటే కాదు.. మీరెక్కడున్నరు, నిన్న మొన్న రోడ్ల మీదకు వచ్చి. నాకు లేదా.. నేను విజిల్ వేస్తే 10 వేల మంది నడుచుకుంట వస్తారు. నాకే కాదు, దమోదర రాజనర్సింహ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి లకు లేరా? ఎవరి శక్తి వారికి ఉంది. పిచ్చి పట్టిందా ఏందీ ? అని జగ్గా రెడ్డి ఘాటుగా స్పంచిందాడు.

జైల్లో కూర్చొని పీసీసీ పదవి ఏందీ? పార్టీ పరువు తీస్తున్నావా? పార్టీ పరువు కాపాడుతున్నావా ? నేను రేవంత్ రెడ్డి ని అడుగుతున్న. పార్టీ ఏమైనా నీ ఒక్కడిదా? పార్టీ నష్టపోతే నాయకులమైన మేమంతా నష్టపోతాం. తమాషా చేస్తున్నారా? మాకు చేత కాదా? మేము అడగలేము అనుకుంటున్నారా ? మాకు లేరా అభిమానులు, కేవలం రేవంత్ రెడ్డికె ఉన్నారా అభిమానులు.

నాలుగు గోడల మధ్య జరగాల్సింది పేస్ బుక్ వేదికగా రచ్చ చేస్తున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే పార్టీకే నష్టం. తక్షణమే నోరుమూసుకొని కూర్చొండి. మేము మీ దగ్గరకు రాలేకనా? రేవంత్ రెడ్డి మరియు అతని అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. ఇది సహించేది లేదు.

అడిగేటోడు లేకనా?.. పిల్లల పరాష్కమ సీఎం అంటే ?

నేను ఆయన అనుచరులను అడుగుతున్న, ఆయనే సీఎం, పీసీసీ అధ్యక్షుడు అంటే ఎట్లా అయితాడు? మేము అరవై డెబ్భై మంది కొట్టించుకుంటే సీఎం అవుతారు. ఊరికే సీఎం కారు.. పైసలు పెట్టాలి, ఉద్యమాలు చేయాలి, ప్రజల్లో తిరగాలి. పిల్లల పరాష్కమ సీఎం అంటే.. అది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు.

టీడీపీ లో ఉన్నప్పుడు మారేందుకు తీస్మార్ ఖాన్ అనిపించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో బలముంది, ఇక్కడ కార్యకర్తలు ఉంటారు. వీళ్ళను పట్కాయించి చేద్దాం అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి నిన్ను అడిగేటోడు లేకనా? ఇదంతా తమాషానా? ఎట్లా కనబడుతున్నాం. నాకు ఉంది పీసీసీ అధ్యక్షుడు, సీఎం కావాలని. నాకే కాదు కాంగ్రెస్ పార్టీలో అందరికీ సీఎం కావాలని ఉంది.

పులి 2వేల ఓట్లతో గెలుస్తారా?

ఇంకా అన్ని బంజేయండి. పులులు, సింహాలు ఏందీ? ఇప్పటికీ బంజేయకుంటే ఢిల్లీకి వెళ్లి సోనియా గారికి చెప్పేసి వస్తా. అతన్ని తక్షణమే పక్కకు పెట్టండి. మాకు పార్టీని ఎలా లేపాలో మాకు తెలుసు. ఆ శక్తి మాకుంది. నాకు అర్ధం కాదు. పేస్ బుక్ లో హీరో హీరో అంటున్నారు, మరి ఆయనెట్లా ఓడిపోయిండు? మావోల్లు కూడా నన్ను పులి పులి అనేటోళ్లు. మరి పులి 2వేల ఓట్లతో గెలుస్తారా? నీయమ్మ పులి పాడుగాను. సుక్కలు చూస్తున్నాం ఫీల్డ్ లో. పైసలు లేంది రాజకీయం నడవదు.

నా మీద కూడా పలు ఆరోపణలు వచ్చాయి. తెరాస జాగల మనం ఉన్నా అదే చేస్తాం. ఎవరు అధికారంలో ఉంటె అది చేస్తారు. అలాంటప్పుడు మనం తప్పులు చేయవద్దు. చేస్తే అలా ఉండకూడదు. నేను పాస్ పోర్ట్ కేసులో మరొక కేసులో నేను తప్పు చేశా. దానికి నేను ఫీల్ అయ్యాను.. దానికి పార్టీ ఏమి చేస్తది. వీరుడు, ధీరుడు, బలవంతుడి ముందు మనమేం చేయలేం. మీరు పిల్లలు ఇలా చేయకండి. పార్టీని నష్ట పరిచే పని చేయకూడదు. జగ్గా రెడ్డి ఏమి గాజులు తొడుక్కొని లేడు. నాతోనే పెట్టుకుంటారా? అని మీడియా సమక్షంలో రేవంత్ రెడ్డి మరియు అతని అనుచరుల తీరును తూర్పారాబట్టారు.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫాంహౌస్‌ పైకి డ్రోన్ కెమెరా పంపింన కేసులో విచారణ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు.

Watch Full Video of Jagga Reddy Slams Revanth Reddy & His Followers

Also Read: TRS Rajya Sabha Candidates

You may also like

Leave a Comment