తిరుమలలో మహా సంప్రోక్షణ ఎలా, ఎందుకు, ఎప్పుడు చేస్తారు – ఫలితాలు

0
తిరుమలలో మహా సంప్రోక్షణ

తిరుమలలో మహా సంప్రోక్షణ ఎలా, ఎందుకు, ఎప్పుడు చేస్తారు – ఫలితాలు: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ముఖ్యంగా తిరుపతిలోని వేంకటేశ్వరుడిని సేవించేవారు బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు.

తిరుమలలో మహా సంప్రోక్షణ ఎందుకు చేస్తారు

మహా సంప్రోక్షణ  ఎందుకు, ఎప్పుడు చేస్తారు

అష్టబందన బాలాలయ మహా సంప్రోక్షణ అంటే ఏమిటి

తిరుమలలో మహా సంప్రోక్షణ ఎలా, ఎందుకు, ఎప్పుడు చేస్తారు – ఫలితాలు

భక్తులు చేసే గోవింద నామ స్మరణాలతో తిరుమలగిరులు మారుమోగుతుంటాయి నిత్యం. ఏడు కొండల స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు కుటుంబ సమేతంగా తిరుమలకు తరలివస్తారు. లిప్త కాలం పాటు జరిగే స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు గంటలు, రోజుల తరబడి వేచి చూసి మరీ దర్శించుకొని జన్మ ధన్యమైనట్టు భావిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తన వద్దకు వచ్చే భక్తులకు స్వామి వారు క్షణం తీరిక లేకుండా దర్శనమిస్తారు.

నిత్యం లక్షల మంది రాకతో తిరుమలగిరులు పోటెత్తుతాయి. బ్రహ్మోత్సవాలు, మరియు ప్రత్యేక సమయాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండటం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయం పై పర్యాటకులు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ సమాధానమే ఈ ప్రత్యేక కథనం.

తిరుమలలో మహా సంప్రోక్షణ ఎందుకు చేస్తారు !

నిత్యం వచ్చే భక్తుల పాద ముద్రలు అలానే ఉండి పోతాయి, నిత్యం శుభ్రం చేసిన పూర్తిగా తుడిచివేయడం సాధ్యంతో కూడుకున్న పని కాదు. అందుకే పన్నెండేళ్ళకు ఒకసారి నిర్వహించే మహా సంప్రోక్షణం సందర్భంగా వీటన్నిటినీ శుభ్రం చేస్తారు.

 బాలాలయం అంటే తాత్కాలిక ఆలయం అని అర్థం. అష్టబందన బాలాలయ మహా సంప్రోక్షణకు మరో ముఖ్య ఉద్దేశ్యం కూడా ఉంది, మూలవిరాట్టులోని స్వామి అంశ 12సం.ల పాటు కొలువుంటుంది. కాల పరిమితిలోపు స్వామి వారి అంశను ఒక కలశంలోకి ఆవాహనం చేయాలి. తిరిగి విరాట్టు రూపంలో స్వామి వారిని స్థిరపరచాలని వైకానష ఆగమం చెప్తుంది అంటారు. అది 8 రకాల ద్రవ్యాలతో ఎలా చేస్తారు క్రింది పేరాలో వివరించడం జరిగింది.

పన్నెండు ఏళ్ళకు ఒకసారి
నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.

ఆ సమయంలో తిరుపతి వెంకన్న విగ్రహంలో శక్తి ఉండదు, ఆ శక్తి ఎక్కడికి పోతుంది!

విగ్రహ ప్రతిష్టాపన
ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.

అలా మలినమయ్యే అవకాశం
ఇక తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.

అపచారంగా భావించి
ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమత్తులు చేస్తారు. ఈ క్రమంలో మొదట శ్రీవారి మూలవిరట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నిపటమే అష్టబంధన కార్యక్రమం.

8 రకాల వస్తువులతో
ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువలతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదల కింద మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెల్లం ఉంటాయి. ఈ 8 రకాల ద్రవ్యాలతో స్వామి వారి పద్మపీఠం బంధనం చేస్తారు.

ఆయా ప్రదేశాల్లో ఉంచుతారు
ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గితోతుంది.

శక్తిని పెంపోందించాటానికే
తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహా సంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమయ్యింది. చివరిగా 2006లో జరిగింది. మళ్లీ ఇప్పుడు 2018 ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
1. శ్రీవారి శక్తి ఆవాహనమే మహా సంప్రోక్షణ.
2. ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ.
అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, వేద పండితులు, వేద విధ్యార్థులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు.

అష్టభంధన కార్యక్రమం
దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో మాదిరి ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మూడు విభాగాలుగా
ఈ బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మంటపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు.

అక్కడ కుంభాన్ని ఉంచుతారు
అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. మూలవిరాట్ కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపింస్తారు.

నూతనంగా నిర్మించినట్లే
ఈ కార్యక్రమంలో మూలవిరాట్ లోకి తిరిగి మూలవిరాట్ ని నూతనంగా నిర్మించినట్లేనని చెబుతారు. దీనిని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి టీటీడీ పాలకమండలి ముహూర్తం పెట్టింది.ఆగష్టు 11న మహా గట్టానికి అంకురార్పణ జరగనుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుంచి 16 తేది వరకూ జరగనుంది. ఇందులో ఆగస్టు 11వ తేది శనివారం రోజు మొత్తంలో 9 గంటల సమయాన్ని మాత్రం దర్శనానికి కేటాయించనున్నారు.

ఆయా రోజుల్లో
12వ తేది ఆదివారం 4 గంటల సమయం,
13వ తేది సోమవారం 5 గంటల సమయం,
14వ తేది మంగళవారం 5 గంటల సమయం, ఈరోజు స్వామీ వారికి అష్టబందన సమర్పణ జరుగుతుంది.
15వ తేది బుధవారం (6 గంటల సమయంలో మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించే అవకాశం కల్పించనున్నారు.) శ్రీవారి మూలవిరాట్టుకు మహాసాతి అభిషేకం జరుగును.
16వ తేది తుల లగ్నంలో ఆనంద నిలయ మహా సంప్రోక్షణ, ఆనంద నిలయ విమానానికి పవిత్ర జలాలతో మహా కుంభాబిషేకన జరుగుతుంది.

దర్శన వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని భక్తి విషయాలు – క్లిక్ చేయండి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here