FROM THE 10TO5 LYRICS ARCHIVE

Naa Favourite Naa Pellam Song Lyrics – జనక అయితే గనక

Published: August 22, 2024

Category: Krishna Kanth, Telugu Lyrics

Naa Favourite Naa Pellam Song Lyrics

Song Lyrics

Naa Favourite Naa Pellam Song Lyrics penned by Krishna Kanth, music composed by Vijay Bulganin, and sung by Adithya RK from Telugu cinema ‘జనక అయితే గనక‘.

Naa Favourite Naa Pellam Song Credits

Janaka Ayithe Ganaka
DirectorSandeep Reddy Bandla
ProducersHarshith Reddy, Hanshitha
SingerAdithya RK
MusicVijay Bulganin
LyricsKrishna Kanth
Star CastSuhas, Sangeerthana Vipin
Music LabelT-Series Telugu

Naa Favourite Naa Pellam Song Lyrics

నేనేది అన్నా బాగుంది కన్నా
అంటూనే ముద్దాడుతావే
నీవే నా పక్కనుంటే చాలే…

కష్టాలు ఉన్న… కాసేపు అయినా
రాజాలా ఫోజు కొడతానే
నీవే నా పక్కనుంటే చాలే…

కలతలు కనబడవే
నువ్వు ఎదురుగ నిలబడితే
గొడవలు జరగవులే
ఒడిదుడుకులు కలగవులే
అర క్షణమైన అసలెప్పుడైనా
కోపం నీలోనా…
ఎపుడైనా చూశానా..?

పుణ్యమేదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే…

నాడు బ్రహ్మ కోరి రాసాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
ఓ ఓ… ఆ ఆ

హే, ఉదయం నే లేచే ఉన్న వేచుంటానే
నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే
హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కాదా మాఫీ

మన గదులివి ఇరుకువి కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు గానీ
ఏ గొలుసులు లేవే…

నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాట
గుండె కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట… ఆ ఆ… ఓ ఓ

పుణ్యమేదో చేసి ఉంటానే
నేడు నేను నిన్ను పొందానే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే…

నాడు బ్రహ్మ కోరి రాసాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

Watch నా ఫేవరెట్టు నా పెళ్లామే Lyrical Video Song

💬 WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.