Pandaga Sir Pandaga Anthe Promos. ETV (ఈటీవీ) తెలుగులో ఉగాది పర్వదినం రోజు (25 మార్చి 2020)న టెలికాస్ట్ కానున్న ‘పండగ సర్ పండగ అంతే’ ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ లో.
ఇప్పటికే 4 ప్రోమోలు విడుదల చేసింది మల్లెమాల ప్రొడక్షన్. అన్నిటికీ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా రోజా, శేఖర్ మాస్టర్ ల డ్యాన్స్ పెర్ఫార్మన్స్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినా ఆ ప్రదర్శనే అదరగొట్టేలా ఉందని కామెంట్లు కూడా వస్తున్నాయి.
రోజా పంచులు
4వ ప్రోమోలో కూడా అదిరిపోయే పంచులు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గన్ మ్యాన్ తో ఎంట్రీ ఇవ్వగా రాకెట్ రాఘవ చూసి, రోజా గారు, మేడం గారు, జడ్జి గారు అని ఎంత పిలిచినా పట్టించుకోదు. పట్టించుకోవడం లేదేంటి అని అతని వైఫ్ అడగ్గా.. ఆలోచించి కష్టం కష్టం అని రాఘవ అరవగా.. ఎవరికీ, ఎక్కడ అని దగ్గరకు వస్తుంది రోజా.. మా ఆవిడ అని పరిచయం చేయగా ఎన్నో ఆవిడ అంటూ రోజా పంచ్ వేస్తుంది. ఇంకా ఈ స్కిట్ లో రోజా చేసే సౌండ్లు హు. హా.. అడిప్ప.., విసిరినదా విధి గానం, ఓ నో, యప్మ.. యాపప్ మా.. (సాధారణంగా ఈ సౌండ్లు స్కిట్లు వస్తున్నప్పుడు మధ్యలో ప్లే చేస్తుంటారు) కొత్తగా అలరిస్తాయి.
శేఖర్ మాస్టర్, రోజా డ్యాన్సు అదుర్స్
మైండ్ బ్లాక్ పాటకు శేఖర్ మాస్టర్ మరియు రోజా చేసిన డ్యాన్సుకు హైపర్ ఆది “ఈ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ సార్ మైండ్ బ్లాక్ అంతే” కామెంట్ ఇస్తాడు. తర్వాత ముక్కు అవినాష్, యాంకర్ లాస్య ల కామెడీ బాగుంది. రెండు సంవత్సరాలు గ్యాప్ ఇస్తే మన పేరు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని లాస్య మీద వేసే డైలాగుకి అందరూ నవ్వుతారు.
ఇమ్మానుయేల్ చేసే కామెడీ కూడా ఒక రేంజ్ లో ఉంది. ముఖ్యంగా అతను చెప్పే డైలాగు “సీఎం పదవి, నా పెదవి దక్కడం చాలా కష్టం” చెప్పడంతో ఇంకా నవ్వులే…
ఒగ్గేసి పోనాదే, పోరి మాయ (శ్రీముఖి మాయ, వర్షిణి మాయ, లాస్య మాయ, విష్ణు ప్రియా మాయ.. ఆఖరికి మా రోజా గారు కూడా మాయ) పాటలతో సన్నీ ఆస్టిన్ అలరిస్తాడు.
చివర్లో శేఖర్ మాస్టర్ రాఘవ తో ఈ డైలాగ్ చెప్పి ప్రోమో ముగించారు.. “ప్రోమో కావాలన్నావుగా ఇచ్ఛా, వేసుకోపో.”
రమణా! ఉగాది రోజు ఉదయం 9 గంటలకు ఈటీవీ పెట్టాలిరా….. ఈవెంట్ వస్తదీ… హైపర్ ఆది బ్యాక్ గ్రౌండ్ లో ఈ డైలాగ్ చెప్తాడు.
ఆ ప్రోమోలు మీరు చూడండి క్రింద…
Pandaga Sir Pandaga Anthe Promos
Also Read: Layilo.. Oggesi Ponaade Song Lyrics
Also Read: పండగ సర్ పండగ అంతే FULL EPISODE