దీపావళి పండగ సందర్భంగా లేడీ సూపర్‌స్టార్‌ విజ‌యశాంతి లుక్ విడుద‌ల చేసింది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర బృందం. మహేష్
బాబు, ర‌ష్మిక కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’.

13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్ర
పోషిస్తుంది. చాలా హుందాగా కుర్చీలో కూర్చొని కనిపిస్తున్న లుక్ ఆకట్టుకునేలా ఉంది.   దర్శకుడు ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ ను విడుదల చేస్తూ ‘సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతిగా లేడీ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు’ అని ట్వీట్ చేశాడు.

మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్ర‌లో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది సరిలేరు నీకెవ్వరు.