విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించిందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. చంద్రయాన్ -2 సాఫ్ట్ లాండింగ్ లో
చివరి నిమిషంలో సాకేతిక లోపం కారణంగా సంకేతాలు తెగిపోయిన మరుసటి రోజే ల్యాండర్ ఆచూకీ లభించడంతో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు.

ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇంకా 13 రోజుల సమయం ఉండడంతో సంబంధాలు ఏర్పడే అవకాశం లేకపోలేదని శివన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ థర్మల్ చిత్రాలను ఆర్బిటార్‌ తీసిందని శివన్ స్వయంగా వెల్లడించారు.