India Vs New Zealand 4th T20I Highlights

న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సీరీస్ ఉత్కఠంగా సాగుతుంది. ఇప్పటికే సీరీస్ కోల్పోయిన కీవీస్ 4వ టీ20లో సునాయాసంగా గెలుస్తుంది అని అందరూ ఊహించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా ఓటమిపాలై సీరీస్ లో 4-0 తో వెనకబడింది.

ఈరోజు (31.01.2020) వెల్లింగ్టన్ వేధికగా భారత్ మరియు న్యూజిలాండ్ మద్య జరిగిన టీ20 మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది. 14 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి విజయాన్ని అందుకుంది భారత్. బుమ్రా వేసిన సూపర్ ఓవర్లో కీవీస్ ఒక్క వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. చేధనలో మొదటి రెండు బంతులను సిక్స్ మరియు ఫోర్ లు బాది తరవాతి బంతికి ఔటు అయినా ఇంకో బంతి మిగిలి ఉండగానే కోహ్లీ ఇండియాకు విజయాన్ని అందించాడు.

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు చేజార్చుకొని 165 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ కు విశ్రాంతినిచ్చి సంజూ సామ్సన్ ఓపెనర్ గా పంపిన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. లాంగ్ దిశగా అధ్బుతమైన సిక్స్ బంతిన సంజు తరవాతి బంతికి ఔటై పెవీలియన్ చేరాడు. తరవాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా వెంటవెంటనే ఔటైనా చివర్లో ఠాకూర్ మరియు సైనీల సహాయంతో 166 పరుగుల పోరాడె లక్ష్యాన్ని ఇచ్చాడు మనీష్ పాండె. పాండే 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కె ఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు.

అదరగొట్టిన శార్థూల్ ఠాకూర్

166 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కీవీస్ సునాయాసంగా గెలిచే స్థితికి వచ్చింది. ఒక దశలో 24 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయాలి. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి క్రీజ్ లో సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ కు తోడుగా సిక్సర్లు బాదుతున్న సీఫెర్ట్ (57) ఉన్నారు. ఇదే జంట చివరి ఒవర్ వరకు ఉన్నారు.

చివరి ఓవర్లో 6 బంతుల్లో 7 పరుగులు అవసరం, శార్థూల్ ఠాకూర్ బంతి అందుకున్నాడు. ఇంక మొదటి బంతితోనే ట్విష్టు మొదలైంది.

  • రాస్ టేలర్ (24) భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఔటై వెనుదిరిగాడు మొదటి బంతికి.
  • డారిల్ మిచెల్ రావడంతోనే రెండో బంతిని బౌండరీకి తరలించాడు.
  • మూడో బంతికి సీఫెర్ట్ రనౌట్ అయ్యాడు. కీపర్ రాహుల్ ఈ ఔట్ చేశాడు.
  • మిచెల్ సాంట్నర్ నాలుగో బంతికి ఒక్క పరుగు చేశాడు.
  • బౌండరీ దగ్గర శివమ్ దూబె క్యాచ్ పట్టడంతో డారిల్ మిచెల్ ఔటయ్యాడు అయిదో బంతికి.
  • చివరి బంతికి రెండు పరుగులు అవసరమున్న తరుణంలో సాంట్నర్ ఒక పరుగు తీసి రెండో పరుగుకు ప్రయత్నించి రన్నౌట్ అయ్యాడు.

ఇలా చివరి ఓవర్లో 4 వికెట్లు చేజార్చుకొని సూపర్ ఓవర్ కు వెల్లి వరసగా రెండు మ్యాచ్లో ఓడింది కీవీస్.

బ్యాట్ మరియు బాల్ తో రాణించిన శార్థూల్ ఠాకూర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

న్యూజిలాండ్ కు కలిసిరాని సూపర్ ఓవర్

సూపర్ ఓవర్ అంటేనే న్యూజిలాండ్ జట్టుకు ఒక పీడకల. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ లు ఆడిన న్యూజిలాండ్ ఒక్క ఆస్టేలియా మీద మాత్రమే 2010లో విజయం సాధించింది. కీవీస్ ఆడిన సూపర్ ఓవర్ మ్యాచ్ లు క్రింద చూడండి.

వెస్టిండీస్ తో ఆక్లాండ్ వేధిక 2008 (ఓటమి)
ఆస్టేలియాతో క్రైస్ట్‌చర్చ్ వేధిక 2010 లో (గెలుపు)
శ్రీలంకతో పల్లెకెలే 2012 లో (ఓటమి)
వెస్టిండీస్ తో పల్లెకెలే వేధిక 2012 లో (ఓటమి)
ఇంగ్లాండ్ తో ఆక్లాండ్ వేధిక 2019 (ఓటమి)
ఇండియాతో హామిల్టన్ వేధిక 2020 (ఓటమి)

వన్డే – ఇంగ్లాండ్ లార్డ్స్ 2019 (లాస్ట్) లో

Read Also: సమత కేసు నిందితులకు ఉరిశిక్ష – ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు