Home » Love Failure Songs » Bagundale Nuvvu Bagundale Love Failure Song Lyrics

Bagundale Nuvvu Bagundale Love Failure Song Lyrics

by Devender

Bagundale Nuvvu Bagundale Love Failure Song Lyrics penned by Ratnakar, music composed by Anji Pamidi, and sung by Ram Adnan.

Bagundale Nuvvu Bagundale Song Credits

Song Love Failure Song
Director Srikanth Potharaju
Producer Ratnakar
Lyrics Ratnakar
Singer Ram Adnan
Music Anji Pamidi
Artists Tony Kick , Pooja Puli
Song Lable

Bagundale Nuvvu Bagundale Love Failure Song Lyrics

పిల్లో అందాల చిట్టీ
నిన్ను అమ్మలా ప్రేమిస్తిని
జాబిలమ్మలా నే చూస్తినే
గుండెల్లో గుడి కట్టీ
నువ్వు దేవతని పూజిస్తినే
నీలో ప్రేమనే ఆశిస్తినే

పిల్లో అందాల చిట్టీ
నిన్ను అమ్మలా ప్రేమిస్తిని
జాబిలమ్మలా నే చూస్తినే
గుండెల్లో గుడి కట్టీ
నువ్వు దేవతని పూజిస్తిని
నీలో ప్రేమనే ఆశిస్తినే

అచ్చంగా నా వేలు పట్టి
ఏడు అడుగులేస్తవనుకుంటినే
పచ్చబొట్టులాగ ఉంటనాని
ఒంటరి వాన్ని చేసి వెళ్ళిపోతివే

బాగుండాలె నువ్వు బాగుండాలె
ఎవ్వరితో ఉన్న బాగుండాలె
బతికేస్తానే నేను బతికేస్తానే
నీ జ్ఞాపకాలతోని బతికేస్తానే

బాగుండాలె నువ్వు బాగుండాలె
ఎవ్వరితో ఉన్న బాగుండాలె
బతికేస్తానే నేను బతికేస్తానే
నీ జ్ఞాపకాలతోని బతికేస్తానే

అందమైన నీ నవ్వూ
అప్పుడే పూసిన చేమంతి పువ్వు
(అప్పుడే పూసిన చేమంతి పువ్వు)
తుమ్మెదల్లే వాలగానే
జుంటె తేనెలనే పంచినావు
(జుంటె తేనెలనే పంచినావు)

బంధము కలిపేసినావు
నాతో వందేళ్ళు తోడుగ ఉంటనన్నావు
అంతలోనే ఏమయ్యిందో
నన్ను ఆగము చేసి వెళ్ళినావు

ఎవ్వరు చేసిన పాపమో
ఇది నువ్వే చేసిన మోసమో
తట్టుకోలేనే ఈ బాధను
నేను ఎల్లకాలమెట్ల ఏగనో

మర్చిపోయే మందు ఉంటె చెప్పే
నేనెట్ల ఓర్చుకొందు ఇంత నొప్పే

బాగుండాలె నువ్వు బాగుండాలె
ఎవ్వరితో ఉన్న బాగుండాలె
బతికేస్తానే నేను బతికేస్తానే
నీ జ్ఞాపకాలతోని బతికేస్తానే

బాగుండాలె నువ్వు బాగుండాలె
ఎవ్వరితో ఉన్న బాగుండాలె
బతికేస్తానే నేను బతికేస్తానే
నీ జ్ఞాపకాలతోని బతికేస్తానే

పెండ్లి కూతురై నువ్వు
మెల్లోన తాళి కట్టించుకున్నావు
(మెల్లోన తాళి కట్టించుకున్నావు)
నిన్నే నమ్ముకున్న నాకు
ఉరి తాడునే మిగిలించినావు
(ఉరి తాడునే మిగిలించినావు)

గుండెల్ని పిండేసినావు
గుండుసూదులతో యద గుచ్చుతున్నావు
అందమైన జీవితాన్ని నువ్
గందరగోళం చేసినావు

పారాణి పెట్టిన కాళ్లతో
నువ్వు కారెక్కి ఊరేగుతున్నవే
ఊపిరి ఆగేటి బాధతో
గుండె బరువెక్కి చిందులేస్తున్ననే

ఇంత బాధ ఉన్నగాని
నిన్నే నే సంతోషంగా
సాగనంపుతానే…

బాగుండాలె నువ్వు బాగుండాలె
ఎవ్వరితో ఉన్న బాగుండాలె
బతికేస్తానే నేను బతికేస్తానే
నీ జ్ఞాపకాలతోని బతికేస్తానే

బాగుండాలె నువ్వు బాగుండాలె
ఎవ్వరితో ఉన్న బాగుండాలె
బతికేస్తానే నేను బతికేస్తానే
నీ జ్ఞాపకాలతోని బతికేస్తానే

Check Other Love Failure Songs Lyrics

You may also like