తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు – ప్రభుత్వ అధికార ప్రకటన

తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు

తెలంగాణలో 17 మార్చి 2020 నాటికి అయిదు (5) కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు. వైరస్ సోకినా వాళ్ళందరూ విదేశాల నుండి వచ్చినవారే తప్ప ఇక్కడ ఉన్న ఎవరికీ వైరస్ లేదు.

తెలంగాణాలో ఈరోజు 17 మార్చి నాటికి 5 కరోనా కేసులు

  1. P-1 (మొదటి కరోనా కేసు): మహేంద్ర హిల్స్ లోని దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి ఇప్పటికే డిశ్చార్జ్ చేశాము. అతనికి దాదాపు 80పైనే మంది కలిశారు. ఏ ఒక్కరికీ ఈ వైరస్ సోకలేదు.
  2. P-2: ఇటలీ నుండి వచ్చిన అమ్మాయికి వైరస్ నిర్దారణ అయింది. ఆమె బస్సులో ఖమ్మం వెళ్ళింది. 42 మంది ఆమెను కలిసిన వారికి పాజిటివ్ రాలేదు.
  3. P-3: నెదర్లాండ్ నుండి వచ్చిన వ్యక్తి. ఇతినికి 69 మంది కాంటాక్ట్ అవ్వాగా ఒక్కరికీ వైరస్ పాజిటివ్ రాలేదు.
  4. P-4: స్కాట్లాండ్ నుండి వచ్చిన 40 సంవత్సరాల వ్యక్తి. ఇతనితో 11 మంది కాంటాక్ట్ లో ఉన్నారు. వారికి కరోనా వైరస్ నెగటివ్ వచ్చింది.
  5. P-5: ఇండోనేషియా నుండి వచ్చిన వ్యక్తి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఆయనతో ఉన్న 11 మందికి కూడా టెస్టులు చేశాము. వాళ్ళు అబ్సెర్వేషన్ లో ఉన్నారు. ఇతను ఎక్కడ ఎయిర్ పోర్టు నుండి వచ్చాడు మొదలగు సమాచారాన్ని సేకరిస్తున్నాము. అని ఈటెల చెప్పారు

మహారాష్ట్ర నుండి వచ్చిన వారికి కూడా పరీక్షలు చేస్తున్నాము. తెలంగాణాలో టెస్టుల కోసం 6 ల్యాబులను ఏర్పాటు చేసినం. ఆరోగ్య సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారని ఈటెల చెప్పారు.